Viral Video: పొగ తాగకపోతే దున్నపోతై పుడతానని భయపడి...బొద్దింక ఏం చేసిందంటే...

పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అనే పద్యం విన్నదో ఏమో కానీ, ఓ బొద్దింక కాల్చి పారేసిన సిగరెట్ ను అందుకొని దాని ఫిల్టర్ వైపు నోరు పెట్టి సిగరెట్ పీల్చి పొగ వదిలిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

news18-telugu
Updated: October 21, 2019, 6:31 PM IST
Viral Video: పొగ తాగకపోతే దున్నపోతై పుడతానని భయపడి...బొద్దింక ఏం చేసిందంటే...
సిగరెట్ తాగుతున్న బొద్దింక
news18-telugu
Updated: October 21, 2019, 6:31 PM IST
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదువేలేదు. ఏదైనా వింత సంఘటన కనిపించగానే దాన్ని వెంటనే కెమెరా ద్వారా చిత్రీకరించి ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేసి వైరల్ చేయడమే నెటిజన్లు పనిగా పెట్టుకున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ అవుతోంది. పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అనే పద్యం విన్నదో ఏమో కానీ, ఓ బొద్దింక కాల్చి పారేసిన సిగరెట్ ను అందుకొని దాని ఫిల్టర్ వైపు నోరు పెట్టి సిగరెట్ పీల్చి పొగ వదిలిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన న్యూయార్క్ సిటీలో చోటు చేసుకోగా, దీన్ని ఇప్పటికే దాదాపు 37లక్షల మంది చూశారు. సుమారు లక్షకు పైగా లైకులు లభించాయి. ఓ వైపు సిగరెట్లు మానివేయమని ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటే, ఈ బొద్దింక మాత్రం ఎంచక్కా సిగరెట్ పొగను పీల్చి ఎంజాయ్ చేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.



First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...