Viral News: ఈ పిల్లోడి దేశభక్తికి ఫిదా కావాల్సిందే..

నిత్యం సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడే సైనికులు.. దేశ ప్రజల నుంచి కోరుకునేది ఏముంటుంది.. చిన్న ప్రోత్సాహం తప్ప..!

news18
Updated: October 12, 2020, 10:52 AM IST
Viral News: ఈ  పిల్లోడి  దేశభక్తికి ఫిదా కావాల్సిందే..
సెల్యూట్ చేస్తున్న దృశ్యం
  • News18
  • Last Updated: October 12, 2020, 10:52 AM IST
  • Share this:
మంచుకొండల్లో గస్తీ కాస్తూ.. నిత్యం చావు బతుకుల మధ్య పోరాటం చేస్తూ శత్రు దేశాల నుంచి దేశ ప్రజలను కాపాడే సైనికులను చూసినప్పుడల్లా ఎవరికైనా తనువు ఉప్పొంగుతుంది. తలెత్తి వారికి శాల్యూట్ చేయాలనిపిస్తుంది. అదే మనం వారికిచ్చే గౌరవం. గౌరవ వందనం వారికి కూడా ఎంతో మానసిక, ఆత్మ స్థైర్యాన్ని ఇస్తుంది. నిండా పదేండ్లు కూడా లేని ఒక చిన్న కుర్రవాడు.. లడక్ లో ఇండో చైనా బార్డర్ వద్ద గస్తీ కాస్తున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

లఢక్ కు చెందిన ఈ పిల్లవాడి పేరు నంగ్యాల్.. ఉండేది చుశుల్. ఐటీబీపీ పోలీసులు అటుగా పెట్రోలింగ్ కు వెళ్తున్న సమయంలో వారినిచూడగానే రెండు కాళ్లు దగ్గరికి తీసుకుని.. చేయి పైకెత్తి వారికి శాల్యూట్ చేశాడు. వారు రాకముందే.. రోడ్డుపక్కన నిల్చున్న నమ్యంగ్... వారు దగ్గరికి రాగానే సైనికులు కవాతు చేసిన మాదిరిగా చేస్తూ.. ఉత్సాహవంతంగా వారికి సెల్యూట్ చేశాడు.





ఇది చూసిన ఐటీబీపీ సైనికులు.. మళ్లీ చేయమని అడగ్గా.. ఆ కుర్రాడు మరింత ఉత్సాహంతో గౌరవ వందనం చేశాడు. ఈ వీడియోను ఐటీబీపీ ట్విట్టర్ లో ఉంచింది. ట్విట్టర్ లో ఉంచిన కొద్దిసేపట్లోనే ఈ వీడియో వైరలైంది.

కాగా, ఇది చూసిన రాజ్యసభ సభ్యుడు చంద్రశేఖర్.. నంగ్యాల్ దేశభక్తికి ముచ్చట పడి.. అతడి చదువుకయ్యే ఖర్చును భరిస్తానని వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చాడు. వారి తల్లిదండ్రుల వివరాలు కోరాడు. ఇక ట్విట్టర్ లో నంగ్యాల్ గురించి పలువురు నెటిజన్లు వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘ఏ వయసు వారైనా నంగ్యాల్ లా సెల్యూట్ చేయగలరా..?’అని రాస్తూ ఈ పిల్లోడి దేశ భక్తికి ఫిదా అవుతున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 12, 2020, 10:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading