Indian Railways : 30 గుంజీలు తియ్యండి... రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఫ్రీ...

Indian Railways : గుంజీలకూ, ప్లాట్‌ఫాం టికెట్‌కూ సంబంధమేంటి? ఫ్రీగా ఎందుకిస్తారు? తెలియాలంటే... కింది మేటర్ చదవాల్సిందే.

news18-telugu
Updated: February 22, 2020, 10:10 AM IST
Indian Railways : 30 గుంజీలు తియ్యండి... రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఫ్రీ...
Indian Railways : 30 గుంజీలు తియ్యండి... రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఫ్రీ... (credit - insta indian railways)
  • Share this:
Indian Railways : మీరు ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్‌‌కి వెళ్తే... ప్లాట్‌ఫాం టికెట్‌ను డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన పని లేదు. స్టేషన్‌లో ఉంచిన ఈ కియోస్క్‌ ముందు 3 నిమిషాల్లో 30 గుంజీలు తీస్తే చాలు... ఫ్రీగా ప్లాట్‌ఫాం టికెట్‌ ఇస్తారు. మీరు అలా గుంజీలు పూర్తి చేయగానే... అలా మెషిన్ నుంచీ ప్లాట్ ఫామ్ టికెట్‌ బయటకొస్తుంది. ఇలా ఎందుకు చేశారంటే ఫిట్‌నెస్ కోసం. ఈ మెషిన్ పేరు ఫిట్‌ ఇండియా స్క్వాట్‌ మెషిన్‌. ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన కలిగించడానికి కేంద్ర రైల్వే శాఖే దీన్ని ఏర్పాటు చేసింది. మామూలుగా ఈ స్టేషన్‌లో టికెట్ రేటు రూ.10. అది కొనుక్కోకుండా ప్లాట్‌ఫాంలోకి వెళ్తే... టికెట్ కలెక్టర్ అడిగినప్పుడు తప్పనిసరిగా టికెట్ చూపించాలి. అది లేకపోతే ఫైన్ వేస్తారు. జైలు శిక్ష కూడా తప్పదు. ఈ సమస్యంతా లేకుండా... ఓ 30 గుంజీలు 3 నిమిషాల్లో తీసేస్తే సరి... ఫ్రీగా టికెట్ సంపాదించేయొచ్చు.

నిజానికి ఇది చాలా ఈజీ అనుకోవచ్చు. ఎందుకంటే... కొంతమంది నిమిషంలోనే 30 గుంజీలు తీసేస్తున్నారు. కొంత మంది పెద్ద వాళ్లు మాత్రం... కొద్దిగా టైమ్ తీసుకొని... రెండు నిమిషాల్లో టార్గెట్ పూర్తి చేస్తున్నారు. అన్ని రకాల వయసుల వాళ్లనూ దృష్టిలోపెట్టుకొని 3 నిమిషాల టైమ్ కేటాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోని రైల్వేతోపాటూ... రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 25 సెకండ్ల ఈ వీడియోలో... ఓ యువకుడు గుంజీలు తీశాడు.


ఇంత మంచి ఆఫర్ పెట్టాక ప్రయాణికులు ఆనందపడకుండా ఉంటారా. చాలా మంది ఇది బాగుందంటున్నారు. 30 పూర్తవగానే మెషిన్ నుంచీ స్లిప్ రావడం బాగుందంటున్నారు. అన్ని స్టేషన్లలోనూ దీన్ని అమలు చెయ్యాలని కోరుతున్నారు. ప్రస్తుతం రెండు వీడియోలనూ లక్షల మంది చూస్తున్నారు. అలాగే మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇలాంటి ఐడియా ఇదే మొదటిది కాదు. 2014లో రష్యాలోని సోచీలో ఒలింపిక్స్ జరిగినప్పుడు... అక్కడి రైల్వే శాఖ ఇలాండి మెషినే ఏర్పాటు చేసింది. వెస్ట్ మాస్కోలోని విస్టావోచనయా స్టేషన్‌లో ఆ యంత్రాన్ని సెట్ చేసింది. 30 గుంజీలు తీసిన ప్రయాణికులకు సబ్‌వేలో ఉచిత రైడ్ సదుపాయం కల్పించింది.
Published by: Krishna Kumar N
First published: February 22, 2020, 10:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading