Home /News /trending /

WATCH ANAND MAHINDRA SHARES VIDEO SHOWING NEXT GENERATION OF TALENT TAMIL NADU PAH

నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ టాలెంట్.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన అద్భుతమైన వీడియో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

గాల్లో పల్టీలు కొడుతూ అదిరిపోయే స్టంట్ లు..

గాల్లో పల్టీలు కొడుతూ అదిరిపోయే స్టంట్ లు..

Tamil nadu: బాలుడు రోడ్డుమీద అద్భుతమైన స్టంట్ లు వేస్తున్నాడు. గాల్లో రబ్బరు బంతిలా ఎగురుతూ... పల్టీలు కొడుతున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India
మహీంద్రా గ్రూప్ చైర్మన్ వ్యాపారాలలో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఆయనకు సోషల్ మీడియా అకౌంట్ కు లక్షల్లో జనాలు ఫాలోయింగ్ లో ఉన్నారు. ప్రతిరోజు అనేక సందేశాత్మక వీడియోలు, స్పూర్తినిచ్చేటు వంటి సందేశాలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన వెంటనే తనదైన శైలీలో స్పందిస్తుంటారు. ఇప్పటికే ఆయన తన ఇన్ స్టాలలో, ఫేస్ బుక్, ట్విటర్ అకౌంట్ లలో అనేక వీడియోలను షేర్ చేశారు.

కొన్ని వీడియోలు వెరైటీ గా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి. ఇంకొన్ని.. చూస్తే.. నమ్మలేని విధంగా కూడా ఉంటాయి. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలలో.. కొన్నిచోట్ల ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన వారు కూడా కొకొల్లలు. తాజాగా, మరో వీడియోను ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ గా (viral video) మారింది.





పూర్తి వివరాలు.. తమిళనాడులోని (Tamil nadu)  తిరునెల్వేలిలోని గ్రామంలోని బాలుగు రోడ్డుమీద అదిరిపోయే స్టంట్ లు వేశాడు. అతను రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్లి.. ఆ తర్వాత.. గాల్లో బంతిలాగా ఎరిరాడు. అంతే కాకుండా.. పల్టీలు కొడుతూ.. అక్కడున్న వారిని అబ్బుర పరిచాడు. రోడ్డుపైన ఉన్నవారు.. అతని పల్టీలు చూస్తునే ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఆనంద్ మహీంద్రా (Anand mahindra)  కండపడింది. దీంతో ఆయన.. తన సోషల్ మీడియాలో (Social media) షేర్ చేస్తు.. నెక్ట్స్ జనరేషన్ ట్యాలెంట్ అంటూ ట్యాగ్ ను జతపర్చారు. అంతే కాకుండా భారత్ లో ట్యాలెంట్ కు ఏమాత్రం కొదువ లేదని అన్నారు.

బాలుడిని.. ప్రత్యేకంగా ప్రొత్సహిస్తే.. జిమ్నాస్టిక్ రంగంలో రాణించి మన దేశానికి మంచి మెడల్స్ తీసుకొస్తాడని పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. మరికొందరు.. ఫ్యూచర్ వరల్డ్ జిమ్నాస్టిక్ ఛాంపియన్ అని, జస్ట్ అమేజింగ్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Anand mahindra, Tamil nadu, Viral Video

తదుపరి వార్తలు