Home /News /trending /

WAR IN UKRAINE IS A CRIME SAYS RUSSIAN PILOT VIDEO GOES VIRAL PVN

Viral Video : ఉక్రెయిన్ పై యుద్ధం నేరమే..రష్యా పైలట్ వీడియో వైరల్

రష్యా పైలట్

రష్యా పైలట్

Russian Pilot : పుతిన్‌ తన పంథా మార్చుకోకపోగ సరికొత్త వ్యూహాలతో ఉక్రెయిన్‌ని దురాక్రమణ చేసేందుకు పావులను కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాలోని ఒక పైలెట్‌ చాలా బలంగా యుద్ధాన్ని వ్యతిరేకించారు. ఈ మారణహోమాన్ని వెంటనే ఆపాలని కోరారు. వ్యక్తిగతంగా తాను ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నానని అన్నారు.

ఇంకా చదవండి ...
Russian Pilot :  ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం నేటికి 20వ రోజుకు చేరింది. ఉక్రెయిన్‌పై ఎలాగైనా పట్టు సాధించాలనుకుంటున్న రష్యా ఎంతమాత్రం వెనక్కి తగ్గకుండా బాంబులు, రాకెట్లను సంధిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాలోనే పుతిన్‌ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దురాక్రమణకు ముగింపు పలకాలని డిమాండ్ లు వనిపిస్తున్నాయి. అయినప్పటికీ పుతిన్‌ తన పంథా మార్చుకోకపోగ సరికొత్త వ్యూహాలతో ఉక్రెయిన్‌ని దురాక్రమణ చేసేందుకు పావులను కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాలోని ఒక పైలెట్‌ చాలా బలంగా యుద్ధాన్ని వ్యతిరేకించారు. ఈ మారణహోమాన్ని వెంటనే ఆపాలని కోరారు. వ్యక్తిగతంగా తాను ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఉక్రెయిన్‌ పై యుద్ధం నేరమని, దీనిని ఆపేందుకు వివేకవంతమైన పౌరులు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చాడు.

విమానంలోని ప్రయాణికుల్ని ఉద్దేశించి మాట్లాడిన పేరు తెలియని రష్యా పైలట్..."ఉక్రెయిన్‌పై యుద్ధం నేరం. దీన్ని మనం కొనసాగించకూడదు. వెంటనే ఆపేయాలి. రక్తపాతం సృష్టించొద్దు. మీ సమయాన్ని నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు"అని తెలిపారు. అంతేకాదు తెలివైన పౌరులు తనతో ఏకీభవించడమే కాక ఆపేందుకు తమవంతుగా కృషిచేస్తారని భావిస్తున్నా అని అన్నాడు.. పైలట్ వ్యాఖ్యలకు ప్రయాణికులకు కూడా చప్పట్లతో తమ మద్దతు తెలిపారు. 33 సెకండ్లపాటూ రష్యా పైలట్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఆ వీడియోని మిలియన్ల మంది చూడగా..లక్షల్లో లైకులు వచ్చాయి ఆ వీడియోకి.


ALSO READ Musk-Putin : దమ్ముంటే రా ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం..పుతిన్ కి ఎలాన్ మస్క్ సవాల్

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని కవర్ చేస్తున్న ది గార్డియన్‌కి చెందిన Pjotr Sauer అనే రిపోర్టర్ ఈ వీడియోని ట్విట్టర్‌లో మార్చి 11న పోస్ట్ చేశారు. కాగా, ఆ రష్యా పైలట్‌ పై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్యాలోని చాలా మంది ప్రజలు బయటకు చెప్పలేకపోతున్న విషయాన్ని ఆయన బయటపెట్టారని అంటున్నారు. అయితే ఎవరెన్ని చెప్పినా యుద్ధాన్ని ఆపాలనే ఆలోచన పుతిన్‌ కి ఉండాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Pilot, Russia, Russia-Ukraine War, Ukraine, Viral Video, Vladimir Putin

తదుపరి వార్తలు