WANT TO EARN 2 LAKHS RUPEES IN HALF AN HOUR THIS DELHI RESTAURANT GIVES YOU BUMPER OFFER MS GH
Veg Thali: ఈ రెస్టారెంట్లో థాలీ ఆరగిస్తే రెండు లక్షలు మీ సొంతం.. ఎక్కడో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
Sampoorn Thali: భోజన ప్రియులకు ఈ రెస్టారెంట్ వారు ఆహ్వానం మాత్రమే కాదు ఒక సవాలు కూడా విసురుతున్నారు. అదేంటంటే వారి రెస్టారెంట్లో అందించే జంబో శాఖాహార థాలీని ఆరగించడం. ఈ థాలీ పేరు సంపూర్ణ థాలీ (Sampoorn Thali). దీన్ని పూర్తిగా ఆరగించేసిన వారికి అక్షరాలా రెండు లక్షలు అప్పజెబుతారు.
సాధారణంగా రెస్టారెంట్ కి వెళ్లి తినడం అంటే చాలా మంది ఇష్టపడతారు. కొందరు తమకు నచ్చిన ఆహార పదార్థాలు మాత్రమే ట్రై చేస్తే మరికొందరు మాత్రం రెస్టారెంట్లో ఉన్న అన్ని రకాల ఆహార పదర్థాలను ట్రై చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వారికి థాలీ చక్కటి వరం అని చెప్పుకోవచ్చు. పది నుంచి వంద వరకూ రకరకాల ఆహార పదార్థాలన్నింటినీ ఒక్క చోట చేర్చి అందించే థాలీ భోజనానికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఇప్పుడు రెస్టారెంట్లు ప్రత్యేకంగా కుంభకర్ణ థాలీ, బాహుబలి థాలీ అంటూ రకరకాల పేర్లు పెట్టి థాలీలను అమ్మేస్తున్నాయి.
అయితే వాటన్నింటినీ తినేందుకు మనం డబ్బులు చెల్లించాలి. కానీ దిల్లీలోని ఓ రెస్టారెంట్లో మాత్రం థాలీ భోజనం చేసినందుకు రెస్టారెంట్ మనకు తిరిగి డబ్బు చెల్లిస్తుంది. అది వెయ్యో.. రెండు వేలో కాదండీ.. ఏకంగా రెండు లక్షల రూపాయలు..
ఈ రెస్టారెంట్ (Restaurant) రాజధాని నగరం ఢిల్లీ (Delhi)లో ఉంది. దీని పేరు `కుటుంబ్ రెస్టారెంట్` (Kutumbh Restaurant). భోజన ప్రియులకు ఈ రెస్టారెంట్ వారు ఆహ్వానం మాత్రమే కాదు ఒక సవాలు కూడా విసురుతున్నారు. అదేంటంటే వారి రెస్టారెంట్లో అందించే జంబో శాఖాహార థాలీని ఆరగించడం. ఈ థాలీ పేరు సంపూర్ణ థాలీ (Sampoorn Thali). దీన్ని పూర్తిగా ఆరగించేసిన వారికి అక్షరాలా రెండు లక్షలు అప్పజెబుతారు. ఆసక్తి ఉండి, ఈ థాలీ సవాలును స్వీకరించేవారెవరైనా రోహిణి, లేదంటే గురుగ్రామ్ (Gurugram)లో ఉన్న రెస్టారెంట్ ఔట్లెట్ (Outlet) దగ్గరకు వెళ్లొచ్చు.
అయితే ఈ థాలీని ఎదురుగా పెట్టుకొని, రోజంతా కబుర్లు చెబుతూ తింటే కుదరదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. రెండు లక్షలు ఊరికినే వస్తాయా ఏంటీ?! ఈ ఛాలెంజ్లో పాల్గొనే వారు సదరు జంభో థాలీని 30 నిమిషాలలో పూర్తిగా తినేయాలి. అప్పుడే అక్షరాలా అందే ఆ రెండు లక్షలూ మన జేబులో పడతాయి.
జంబో ప్లేటులో ఇవే పదార్థాలు
ఈ భారీ శాఖాహార థాలీలో ఏకంగా 45 పదార్థాలు ఉంటాయి. ఇక వీటన్నింటి బరువూ విన్నారంటే అవాక్కవడమే కాదు, అధిరిపడతారు. అవునండీ, ఈ జంబో ప్లేటులో ఉండే ఆహార పదార్థాల బరువు 18.5 కేజీలు. ఆశ్చర్యపోయారు కదూ? ఇంత విశేషం ఉంది కాబట్టే ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత బరువైన శాఖాహార థాలీగా పేరు గడించింది. ఇప్పుడు చెప్పండి, ఈ భారీ భోజనాన్నిఅందరూ తినగలరంటారా?
పోటీ కోసం కాకుండా కూడా ఈ థాలీని తీసుకొని ఇద్దరు, లేదా ముగ్గురు కలిపి తినేయొచ్చు. ఈ జంబో థాలీ విలువ రూ. 1699 రూపాయలు మాత్రమే. ఇది ఎంత భారీగా ఉన్న ఇందులోని ఆహారపదార్థాలు మాత్రం ఎంతో రుచిగా ఉంటాయనడంలో సందేహమేలేదు. ఎంతో పొందికగా అమర్చిన ఈ భోజనం ప్లేటులో నోరూరించే స్టార్టర్లు, సూపులు ఆహ్వానిస్తాయి. ఇక అసలు భోజనం మాత్రం భారీగానే ముందుంటుంది. రుచికరమైన పానియాలతో పాటు ముగింపు డిసర్ట్లు చేతి వేళ్లను కట్టిపడేస్తాయి. అంతా రుచికరమే గానీ బరువే బెంబేలెత్తిస్తుంది.
ఈ భారీ థాలీలో కనిపించే మెయిన్ కోర్సు అయిన ప్రధాన వంటకాల వివరాల్లోకి వెళితే, అందులో ఛోళె, మటర్ పనీర్, వెజ్ కొల్హపురీ, దాల్ భఖరీ, పనీర్ మఖనీ వంటివి ఉంటాయి. ఇక్కడ పేరుకు కొన్ని ఉదహరించాం అంతే. అసలు రుచుల కోసం ప్లేటు ముందుండాల్సిందే. ఇక్కడితో అయిపోలేదు. ఎదురూగా 22 అంగుళాల నాన్ కనిపిస్తుంది. అంతేనా, తందూరీ పరోటా, లచ్చా పరోటాలు కళ్లను ఆకర్షిస్తాయి. ఇంక డిసర్ట్ మెనూలో వేడివేడి గులాబ్ జామూన్, కుల్ఫి, లస్సీలుంటాయి.
అంత వీజీ కాదండోయ్...
ఆహా ! ఎంత అద్భుతమైన భోజనం అనుకొని కమిట్ అవుదామనుకుంటున్నారా? అనుకున్నంత సులువేమీ కాదు. ఈ పోటీ మీ జీవితంలో మరిచిపోలేని సవాలుగా మిగిలిపోతుంది. ఎదురుగా రెండు లక్షల రూపాయల బహుమతి ఊరిస్తుంటే, మరో ఆలోచన లేకుండా ప్లేట్ ముందు కూర్చుంటారేమో? ముందుగా ఖాళీ కడుపుతో అక్కడికి వెళ్లాలి. ఎందుకంటే ఈ థాలీ ఏకంగా ఐదు ఖాళీ కడుపులను నింపగలదు మరి!
ఒకవేళ మీరు ఈ సవాలును స్వీకరించాలని అనుకోకపోతే, అబ్బురపరిచే ఈ భోజనాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులంతా కలిసి పంచుకొని, హాయిగా తినొచ్చు. ఇది కూడా ఎంతో అద్బుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రెడీ యేనా!!