సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రధాని నరేంద్ర దామోదార్ దాస్ మోడీ గుజరాత్ లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 17, 1950 న వాదానగర్ లో జన్మించిన నరేంద్ర మోడీ.. 2001 లో మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 2001 నుండి 2014 వరకు గుజరాత్ సీఎంగా 12 సంవత్సరాలు 227 రోజులు పనిచేశారు. 2014 లో భారత 14 వ ప్రధానిగా, తరువాత 2019లో మళ్లీ ఎన్నికయ్యారు.
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే మోడీకి ప్రజలలో విశేష ఆదరణ పొందారు. గత ఆరేండ్లుగా వస్తున్న ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం.
ప్రతి నెలా నాలుగో ఆదివారం రేడియో లో ‘మన్ కీ బాత్’ ద్వారానే గాక సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గానే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారు.
ఆయనను కలవాలని, తమ బాధలు ఆయనతో చెప్పుకోవాలని చాలామందికి ఉంటుంది. మీరు కూడా పీఎంను సంప్రదించాలనుకుంటే..
మోడీని ఫోన్ కలుసుకోవాలనుకునే వారికి ఫోన్ నెంబర్లు.. :
మీరు ప్రధాని మోడీ నివాసానికి లేదా కార్యాలయాని (పీఎంవో)కి కాల్ చేయొచ్చు. లేదా ఆయనకు ఫ్యాక్స్ చేయాలనుకుంటే.. అందుకు సంబంధించిన వివరాలివిగో..
PMO: + 91-11-23012312
PMO ఫ్యాక్స్: + 91-11-23019545, 23016857
PMO హెల్ప్‌లైన్: + 91-1800-110-031
అయితే.. వీటికి డయల్ చేసేప్పుడో, ఫ్యాక్స్ లు పంపేటపుడో.. ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవడం మంచిది. ఈ కాల్స్ ను ముందుగా పీఎంవో రిసీవ్ చేసుకుని.. అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తుంది.
పీఎం సోషల్ మీడియా ఖాతాలు :
సోషల్ మీడియాలో ప్రపంచంలో అత్యంత చురుకైన నాయకులలో పీఎం మోడీ ముందుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ట్వీట్లు, మెసేజ్ లన్నీ ట్రాక్ చేయడం ఆయనకు అసాధ్యం. కావున, దీనికోసం ప్రత్యేకంగా పనిచేసే బృందం ఉంది.
యూట్యూబ్:
https://www.youtube.com/user/narendramodi
ఫేస్బుక్: https://www.facebook.com/narendramodi
ట్విట్టర్: https://twitter.com/narendramodi
ఈ క్రింది హ్యాండిల్స్‌తో పీఎంను ట్వీట్లలో ట్యాగ్ చేయవచ్చు:
అవి.. @narendramodi లేదా @PMOIndia
Instagram: https://instagram.com/narendramodi
ప్రధాని మోడీ ఇ-మెయిల్ ఐడి:
ప్రధానమంత్రి కార్యాలయాన్ని connect@mygov.nic.in లో సంప్రదించవచ్చు.
అంతేగాకుండా మీ సమస్యలకు సంబంధించిన వివరాలను ఇక్కడ నమోదుచేసుకోవచ్చు ... https://pmopg.gov.in/pmocitizen/Grievancepmo.aspx
ఇవేగాక పీఎంతో ఇంకేదైనా విషయాల గురించి చర్చించాలనుకుంటే... : https://www.mygov.in/home/61/discuss/