WALMART TO DELIVER FOOD AND BABY ESSENTIALS THROUGH DRONE AK GH
Drones ద్వారా ఫుడ్ డెలివరీ.. తొలి కమర్షియల్ సర్వీసులను ప్రారంభించిన Walmart..
వాల్‌మార్ట్ డ్రోన్ సేవలు
గతంలో ఇష్టమైన ఆహారం తినాలంటే రెస్టారెంట్లకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చాక.. మనకి నచ్చిన ఫుడ్ నిమిషాల్లోనే ఇంటి వద్దకు వచ్చేస్తోంది. వంట చేసే తీరిక లేకపోయినా, హోటల్ ఫుడ్ రుచి చూడాలన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫుడ్ డెలివరీ సేవలపైనే ఆధారపడుతున్నారు.
గతంలో ఇష్టమైన ఆహారం తినాలంటే రెస్టారెంట్లకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చాక.. మనకి నచ్చిన ఫుడ్ నిమిషాల్లోనే ఇంటి వద్దకు వచ్చేస్తోంది. వంట చేసే తీరిక లేకపోయినా, హోటల్ ఫుడ్ రుచి చూడాలన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫుడ్ డెలివరీ(Food Delivery) సేవలపైనే ఆధారపడుతున్నారు. కేవలం ఫుడ్ డెలివరీ మాత్రమే కాదు కరోనా సమయంలో హోమ్ డెలివరీ ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి. దాంతో డెలివరీ సంస్థలు డ్రోన్ల సాంకేతికతను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా రిటైలర్ సంస్థ వాల్‌మార్ట్(Walmart) కూడా తన తొలి కమర్షియల్ డ్రోన్( Drones)డెలివరీ సర్వీస్ ప్రారంభించింది. వాల్‌మార్ట్ సంస్థ ఫుడ్‌తో సహా డైపర్లను సైతం డ్రోన్ ద్వారా డెలివరీ చేయడం ప్రారంభించి హాట్‌టాపిక్‌గా మారింది. అయితే వాల్‌మార్ట్ తన తొలి కమర్షియల్ యూఎస్ డ్రోన్ డెలివరీ సేవను అర్కాన్సాస్‌లోని పీరిడ్జ్ (Pea Ridge)లోని 50 మైళ్ల పరిధిలోనే అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఇకపై అర్కాన్సాస్ (Arkansas)లోని ఫార్మింగ్టన్లో నివసించే సెలెక్టడ్ కస్టమర్లు ఆకాశ మార్గం ద్వారా తమ ఆర్డర్లను అందుకోవచ్చు.
అటానమస్ జిప్‌లైన్‌తో ఒప్పందం
వాల్‌మార్ట్ సంస్థ అటానమస్ జిప్‌లైన్ కంపెనీతో కలిసి డ్రోన్ డెలివరీ సేవను గత వారంలో ప్రారంభించింది. ఈ జిప్‌లైన్ డ్రోన్లు పారాచూట్-లాడెన్ ప్యాకేజీలను కస్టమర్ల చేతికి అందేలా డ్రాప్ చేస్తాయి. వాల్‌మార్ట్ తన డ్రోన్ డెలివరీలను మెల్లిమెల్లిగా విస్తరిస్తోంది. ప్రస్తుత వాల్‌మార్ట్ సేవలతో అర్కాన్సాస్‌లోని ఫార్మింగ్టన్లో నివసించే కస్టమర్లు ట్యూనా క్యాన్లు, బేబీ సప్లయ్స్, పేపర్ ప్లేట్లు వంటి చిన్న వస్తువులను నేటి నుంచే ఆర్డర్ చేయవచ్చు. తద్వారా డ్రోన్ల ద్వారా ఆర్డర్స్ అందుకోవచ్చు. వాల్‌మార్ట్ డ్రోన్అప్తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇది రాబోయే నెలల్లో రోజర్స్, ఏఆర్&బెంటన్విల్లే, ఏఆర్లలో కలిసిడ్రోన్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. డ్రోన్అప్ కంపెనీ తన క్వాడ్‌కాప్టర్ డ్రోన్ల ద్వారా వాల్‌మార్ట్ స్టోర్‌కు ఒక-మైలు పరిధిలో గల నివాస సముదాయాలకుడెలివరీ సేవలను అందించగలదు. అయితే రోజర్స్, ఏఆర్&బెంటన్విల్లే, ఏఆర్ అనే మూడు స్టోర్లు కూడా జిప్లైన్సేవలు అందించేప్రాంతంలోనే ఉన్నాయి. ఈ కంపెనీ కస్టమర్లు ఆర్డర్ చేసిన ప్యాకేజీలను ఆకాశం నుంచి డ్రాప్ చేయడానికి బదులు కేబుల్‌ల ద్వారా కిందకి జారవిడస్తాయి. 3 స్టోర్ల పరిధిలో ఆపరేటర్ అయ్యే డ్రోన్అప్ డ్రోన్లు జిప్‌లైన్ సేవలు వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.
మొత్తం 26 రకాల అత్యవసర వస్తువుల డెలివరీ..
వాల్‌మార్ట్ మొత్తం 26 అత్యవసర వస్తువులను డ్రోన్ల ద్వారా కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్యాక్ డైపర్లు, బట్టర్ మిల్క్ పాన్కేక్ మిక్స్ బాక్స్, పేపర్ ప్లేట్లు, క్రేయాన్లు, ట్రాష్ బ్యాగ్‌లు, విటమిన్లు, స్కాచ్ టేప్, ప్రాథమిక ఆహార పదార్థాలు, పిల్లల వస్తువుల (బేబీ ఫుడ్‌తో సహా)ను వాల్‌మార్ట్ డ్రోన్ల ద్వారా డెలివరీ చేయనుంది. ప్రతి వస్తువుకు బరువు ఉంటుంది.
కాబట్టి డెలివరీ వస్తువుల బరువును బట్టి 10 డాలర్ల(సుమారు రూ.745)ను డెలివరీ ఛార్జ్ గా తీసుకుంటుంది వాల్‌మార్ట్. 4 పౌండ్ల బరువు (1.8కేజీ) లేదా అంతకంటే తక్కువ బరువున్న వస్తువుల డ్రోన్ డెలివరీకి 10 డాలర్లను డెలివరీ ఫీజుగా వాల్‌మార్ట్ వసూలు చేస్తుంది. డ్రోన్అప్ తన కస్టమర్లు 30 నిమిషాల కంటే త్వరగా ఆర్డర్లను పొందవచ్చని చెబుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.