టీమిండియా క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ప్రాణాలు కాపాడిన బస్ డ్రైవర్, కండక్టర్‌ను రియల్ హీరోలుగా చూస్తున్నారు క్రికెట్ అభిమానులు, క్రికెటర్లు. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం (Friday)తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి తన స్వగ్రామం ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి వెళ్తుండగా కారు ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై డివైడర్‌ని ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో కారు విండో డోర్ అద్దాలు పగలగొట్టుకొని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో విండో డోర్‌లో చిక్కుకుపోవడంతో పంత్ కారు వెనుకే వస్తున్న హర్యానా రాష్ట్ర రోడ్ వేస్ బస్సు డ్రైవర్ సుశీల్(Sushil)ప్రమాదాన్ని గమనించాడు. వెంటనే వెంటనే బస్సు నిలిపివేశాడు. కండక్టర్ పరమ్ జీత్(Param Jeet)తో కలసి కిందకు దిగి వెళ్లి చూడగా కారు విండోలో పంత్ చిక్కుకొని ఉండటాన్ని గమనించాడు. వెంటనే బయటకు తీసి రక్షించారు.
డ్రైవర్, కండక్టరే హీరోలు..
క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో చిక్కుకొని ప్రాణపాయస్థితిలో ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లారు. అటుపై డెహ్రాడూన్‌లోని మాక్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. సమయానికి బస్ డ్రైవర్ కాపాడటం వల్లే తీవ్రగాయాలతో బయటపడ్డాడు.
క్రికెటర్‌కు ప్రాణదానం..
పంత్ ను కాపాడిన బస్సు డ్రైవర్ సుశీల్, కండక్టర్ పరమ్ జీత్ కు హర్యానా రోడ్ వేస్ అధికారులు ప్రశంసా పత్రాలు, షీల్డ్ ను బహూకరించి, వారిని అభినందించారు. ఓ మనిషి ప్రమాదంలో ఉండటంతో మానవత్వానికి నిదర్శనమని హర్యానా రాష్ట్ర రవాణా మంత్రి మూల్ చంద్ శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీరిని ప్రశంసించింది.
Gratitude to #SushilKumar ,a Haryana Roadways driver who took #RishabhPant away from the burning car, wrapped him with a bedsheet and called the ambulance. We are very indebted to you for your selfless service, Sushil ji ???? #RealHero pic.twitter.com/1TBjjuwh8d
— VVS Laxman (@VVSLaxman281) December 30, 2022
మాజీ క్రికెటర్ అభినందనలు...
హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్ టీమిండియా ప్లేయర్ ప్రాణాలు కాపాడటాన్ని మాజీ క్రికెటర్ నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీ వీ ఎస్ లక్ష్మణ్ అభినందించారు. రిషబ్‌పంత్‌ను కాలిపోతున్న కారు నుండి దూరంగా తీసుకెళ్లి, బెడ్‌షీట్‌తో చుట్టి, అంబులెన్స్‌కి కాల్ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. మీ నిస్వార్థ సేవకు మేము ఎంతో రుణపడి ఉంటాము సుశీల్ జీ అంటూ నమస్కారం చేసారు. రియల్ హీరో అంటూ క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు లక్ష్మణ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Rishabh Pant, Sports