హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Vistara Offer: విస్తారా బంఫర్ ఆఫర్.. వారు ఫ్రీగా విమానాల్లో ప్రయాణించవచ్చు.. పూర్తి వివరాలు..

Vistara Offer: విస్తారా బంఫర్ ఆఫర్.. వారు ఫ్రీగా విమానాల్లో ప్రయాణించవచ్చు.. పూర్తి వివరాలు..

కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వ వైద్యులు, నర్సులకు విస్తారా బంఫర్ ఆఫర్ ప్రకటించింది.

కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వ వైద్యులు, నర్సులకు విస్తారా బంఫర్ ఆఫర్ ప్రకటించింది.

కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వ వైద్యులు, నర్సులకు విస్తారా బంఫర్ ఆఫర్ ప్రకటించింది.

  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారు. అయితే అటువంటి సేవలందిస్తున్న వైద్యులు, నర్సులకు విస్తారా గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వైద్యులు, నర్సుల.. తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్ పౌర విమానయాన శాఖ జాయింట్ సెక్రటరీ ఉషా పఢీకి(Usha Padhe) లేఖ రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్‌కు ఎయిర్ లాజిస్టిక్స్ పరంగా తక్షణ సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నామని విస్తారా తెలిపింది. మిమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఇందుకు సంబంధించిన లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. విస్తారా ఆఫర్‌ను అభినందిస్తున్నట్టు తెలిపింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో కలిసి పోరాడదామని పిలుపునిచ్చింది.

  సీట్ల లభ్యత దృష్టిలో ఉంచుకుని ముందు వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు.. ముందుగా సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ‘ప్రభుత్వ సంస్థలకు చెందిన వైద్యులు, నర్సులను మా దేశీయ నెట్‌వర్క్‌లో ఉచితంగా ప్రయాణించడానికి, వారి సేవలు ముగిసిన తిరిగి గమ్యస్థానం చేర్చడానికి సేవలు అందించడం సంతోషంగా ఉంది. ఈ సేవను పొందే సిబ్బంది ప్రయాణానికి సంబంధించిన అన్ని SOPలను తప్పనిసరిగా పాటించాలి మరియు సంబంధిత గుర్తింపు పత్రాలను సమర్పించాలి "అని విస్తారా సంస్థ తెలిపింది.


  ఇక, భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,52,991 కరోనా కేసుల నమోదయ్యాయి. దీంతో. మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరింది. కొత్తగా 2,812 మంది చనిపోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,95,123కి చేరింది. తాజాగా 2,19,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,43,04,382కి చేరింది. రికవరీ రేటు 83.5 శాతం నుంచి తగ్గి... 82.6 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్‌లో 28,13,658 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  First published:

  Tags: Bumper offer, Covid-19, Doctors, Flight Offers

  ఉత్తమ కథలు