HOME »NEWS »TRENDING »virtual meetings fail but some persons who participate in them become famous overnight here is some examples nk gh

Virtual Meetings: మీటింగ్స్ ఫెయిల్... పర్సన్స్ సక్సెస్... అంతా కరోనా మహిమ

Virtual Meetings: మీటింగ్స్ ఫెయిల్... పర్సన్స్ సక్సెస్... అంతా కరోనా మహిమ
మీటింగ్స్ ఫెయిల్... పర్సన్స్ సక్సెస్... అంతా కరోనా మహిమ (image credit - twitter)

Virtual Meetings: ఈ కరోనా రోజుల్లో ఆన్‌లైన్ వర్చువల్ మీటింగ్స్‌లో రకరకాల చిత్రాల్ని మనం చూస్తున్నాం. వాటి వల్ల ఒక్కోసారి మీటింగ్స్ ఫెయిలైనా, వ్యక్తులు సెలబ్రిటీలు అవుతున్నారు.

  • Share this:
గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్వేత మీమ్స్ నిండిపోయి ఉన్నాయి. శ్వేత మైక్ ఆఫ్ చేయి... శ్వేత నీ మైక్ ఆన్‌లో ఉంది... అంటూ ఆ అమ్మాయిని ఆటపట్టించడంలో ప్రతి ఒక్కరూ తలమునకలైపోయి ఉన్నారు. ఇంతకీ సంగతేంటి అనుకుంటున్నారా? శ్వేత అనే అమ్మాయి ఆన్ లైన్ క్లాస్ వింటోంది. ఆ క్లాసులో ఆమెతో పాటు మరో వందకు పైగా విద్యార్థులున్నారు. ఆన్ లైన్ క్లాస్ వింటుండగా ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆమె మైక్ ఆఫ్ చేయడానికి బదులుగా స్పీకర్ ఆఫ్ చేసి తన స్నేహితురాలితో మాట్లాడడం ప్రారంభించింది. తన మరో స్నేహితుడి ప్రేమ, వ్యక్తిగత జీవితం గురించి స్నేహితురాలితో చర్చించింది. ఈ సమయంలో క్లాస్‌లో ఉన్న తోటివారు ఆమెకు చాలాసార్లు శ్వేతా మైక్ ఆఫ్ చేయి... శ్వేత నీ మైక్ ఆన్‌లో ఉంది అంటూ సూచనలు చేసినా ఆమె పట్టించుకోలేదు. దీంతో ఆ క్లాస్ లో ఉన్న ఓ వ్యక్తి ఈ ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది ఫేమస్ అయిపోయింది.జూమ్ లేదా ఇతర ఆన్ లైన్ మీటింగ్ ప్లాట్ ఫాంలపై ఇలాంటి తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని స్నేహితుల వరకే ఉండిపోతే.. మరికొన్ని ఆన్ లైన్‌లో దర్శనమిచ్చి అందరినీ నవ్విస్తుంటాయి. అలా గతంలో జూమ్ మీటింగ్‌ల వల్ల నవ్వులపాలైన వారి గురించి చూద్దాం.
1. సక్సెస్ ఫుల్ భార్య.. ప్యాంట్స్ లేని భర్త:
ఏ దేశానికి చెందినదో తెలీదు కానీ ఈ వీడియోలో ఓ భార్య మీటింగ్‌లో మాట్లాడుతూ ఉండగా.. భర్త ప్యాంట్స్ లేకుండా ఆమె వెనక్కి వచ్చి తనతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆమె వీడియో ఆన్ ఉందని తెలుసుకొని పారిపోయే క్రమంలో దెబ్బ కూడా తగిలించుకున్నాడు.2. మీటింగ్ లీవ్ చేయడం మర్చిపోతే అంతే:
అమెరికాకి చెందిన ఓ వ్యక్తి మీటింగ్ తర్వాత కాల్ ఎండ్ చేయడం మర్చిపోయి అలాగే వెళ్లిపోయి షార్ట్‌తో తిరగడం, షార్ట్ లోపల చేతులు పెట్టుకొని గోక్కోవడం వంటివన్నీ చేస్తూ అభాసుపాలయ్యాడు. అతడి సహోద్యోగులు ఫోన్ చేసి చెప్పగానే పారిపోయాడు.


3. క్యాట్ ఫిల్టర్‌తో కోర్టు సమావేశానికి:
ఈ వీడియోలో ఓ వ్యక్తి క్యాట్ ఫిల్టర్‌తో అఫిషియల్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ విషయం గుర్తించిన ఇతరులు చెప్పినా.. ఆ ఫిల్టర్ తొలగించడం తన వల్ల కావడం లేదని అతడు వెల్లడించడం విశేషం.


4. లైవ్‌లో పిల్లలు వస్తే ఎలా ఉంటుంది:
సాధారణంగా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా వస్తేనే ఏదోలా ఉంటుంది. కానీ పిల్లలు అఫిషియల్ మీటింగ్ లలో కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బీబీసీ తో లైవ్ ఇంటర్వ్యూ జరుగుతుండగా.. ఇద్దరు పిల్లలు గదిలోకి వచ్చిన ఈ వీడియో అప్పట్లో చాలా ఫేమస్‌గా మారింది.


5. మైక్ ఆఫ్ చేయడం మర్చిపోయి:
ఆన్ లైన్ క్లాస్ జరుగుతోంది. విద్యార్థి ఓ ప్రశ్న అడిగాడు. టీచర్ దానికి సమాధానం చెబుతున్నాడు. కానీ అప్పుడే ఇంట్లో పని చెబితే ఎలా ఉంటుంది? ఈ వీడియోలా ఉంటుంది. మైక్ ఆఫ్ చేశాననుకొని భావించిన ఆ విద్యార్థి ఇంట్లో వారిపై అరిచేశాడు. కానీ మైక్ ఆఫ్ చేయలేదని ఆ తర్వాత తెలుసుకున్నాడు.6. కెమెరా ఆన్‌లో ఉంది:
కెమెరా ఆన్‌లో ఉంచి టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తుండగా భార్య వచ్చి ముద్దు పెడితే ఎలా ఉంటుంది. ఈ వ్యక్తికి వచ్చినట్లుగానే కోపం వస్తుంది. ఈ ఫన్నీ వీడియో మన దేశంలో జరిగిందే.


ఇలా వర్చువల్ మీటింగ్స్ అప్పుడప్పుడూ డిస్టర్బ్ అవుతున్నాయి. ఐతే... సోషల్ మీడియాలో ఇవి బోలెడు ఆనందాన్ని పంచుతున్నాయి.
Published by:Krishna Kumar N
First published:February 20, 2021, 12:00 IST