మరీ ఇంత అదృష్టమా...ఒకే సారి 20 లాటరీలు గెలుచుకున్న వర్జీనియా వ్యక్తి

అదృష్టమంటే వర్జీనియాకు చెందిన అతనిదేనేమో...అతను 20 లాటరీలు కొంటే 20 లాటరీలూ గెలుచుకున్నాడు. దీని ద్వారా అతను ఎంత నగదు బహుమతి గెలుచుకున్నాడో తెలుసా?

news18-telugu
Updated: September 10, 2020, 8:12 AM IST
మరీ ఇంత అదృష్టమా...ఒకే సారి 20 లాటరీలు గెలుచుకున్న వర్జీనియా వ్యక్తి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పలేం.. ఒక్క లాటరీతో తమ జీవితాలే మారిపోయిన సంఘనలెన్నో ఉన్నాయి. లాటరీ వేసే ప్రతి ఒక్కరూ తమకే లాటరీ దక్కాలని దేవున్ని కోరుకుంటారు. కానీ కోట్లాది మందిలో లాటరీ ఒక్కరినే వరిస్తుంది. ఏదో ఒక లాటరీ తగలడమే గగనం.. అలాంటిది వేసిన ప్రతి లాటరీ గెలుచుకోవడానికి ఎంత అదృష్టం ఉండాలి.  ఆగస్టు నెలలో వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తి  25 లాటరీ టికెట్లు కొనుగోలు చేసిన 25 లాటరీలన్నీ గెలుచుకున్నాడు. ఈ లాటరీల ద్వారా అతనికి 1,25,00 అమెరికన్ల డాలర్లు(దాదాపు రూ.90 లక్షలు) గెలుచుకున్నాడు.

ఇది మరువకముందే మరో వ్యక్తిని అదృష్టం తలుపు తట్టింది. ఈ నెలలో వర్జీనియా సౌత్బోస్టన్కి చెందిన టోనీమైల్స్‌ను కూడా అటువంటి అదృష్టమే వరించింది. అతను 20 లాటరీలు కొంటే ఆ ఇరవై లాటరీలన్నీ గెలుచుకున్నాడు. ఆశ్చర్యకరంగా అతను కొనుగోలు చేసిన 20 లాటరీలూ గెలవడంతో అతనిపై అదృష్ట వర్షం కురిసింది.

కాగా అతను గెలుచుకున్న ఒక్కో లాటరీకి 5,000 డాలర్ల ( దాదాపు రూ.3.66 లక్షలు) బహుమతి రాగా మొత్తం లాటరీలకు కలిపి లక్ష డాలర్లు (దాదాపు 73.24 లక్షలు) బహుమతి పొందాడు.

ఒకేసారి ఇన్ని లాటరీలను గెలవడంతో సంతోషపడ్డ టోనీ.. లాటరీ గెలుచుకున్న డబ్బుతో తనకున్న అప్పులన్నీ తీర్చేస్తానని పేర్కొన్నాడు.

కొన్ని లాటరీలన్నీ గెలవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోవడం తమ వంతైంది. కాగా ఆగష్టు30న సౌత్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ పిక్ 4 డ్రాయింగ్లో  భాగంగా మొత్తం1,400 మంది లాటరీ గెలుచుకొని  $ 3.5 మిలియన్ల బహుమతులు పొందారు.
Published by: Janardhan V
First published: September 10, 2020, 8:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading