శాంతాక్లాజ్‌గా మారిన విరాట్ కోహ్లీ... ఓ మంచి పని కోసం...

విరాట్ కోహ్లీ తనంతట తానుగా వస్తేనే చాలు... ఎవరికైనా పండగే. అలాంటిది శాంతాక్లాజ్ అవతారంలో వచ్చి గిఫ్టులు ఇస్తే... ఇక ఆ ఆనందానికి హద్దులుంటాయా?

news18-telugu
Updated: December 22, 2019, 7:52 AM IST
శాంతాక్లాజ్‌గా మారిన విరాట్ కోహ్లీ... ఓ మంచి పని కోసం...
విరాట్ కోహ్లీ (credit - twitter - Star Sports)
  • Share this:
ఇది క్రిస్మస్ టైమ్. శాంతాక్లాజ్ వచ్చి గిఫ్టులు ఇస్తారని పిల్లలంతా ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా నిరుపేద చిన్నారులైతే... గిఫ్టులు అవసరం లేదు... కనీసం ఆ వేడుకల్ని కళ్లారా చూసినా చాలని అనుకుంటారు. అలాంటి పిల్లల్ని ఆశ్చర్యపరుస్తూ నిజంగానే శాంతాక్లాజ్ వచ్చారు. గిఫ్టులు ఇచ్చారు. అవి తీసుకొని ఆ నిరుపేద చిన్నారులు ఎంతో ఆనందపడ్డారు. కేరింతలు కొట్టారు. వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషించారు. వాళ్లకు క్రిస్మస్ ముందే వచ్చేసినట్లైంది. ఆ గిప్టులు తీసుకున్న పిల్లల ముఖాలు చూస్తే... స్వచ్ఛమైన ఆనందం, కల్మషం లేని మనసులు వాళ్లలో కనిపిస్తున్నాయి. కోల్‌కతాలో జరిగిందీ ఘటన. అక్కడి ఓ అనాథ శరణాలయానికి శాంతాక్లాజ్ రూపంలో వెళ్లిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... గిఫ్టులు ఇచ్చాడు. ఐతే... విరాట్ వస్తున్నట్లు ఎవరికీ తెలియదు. శాంతాక్లాజ్ రూపంలో ఉన్నది విరాట్ అని పిల్లలకు కూడా తెలియదు. ఒక్కసారిగా వాళ్లకు తన ఫేస్ చూపించగానే... పిల్లలు ఫుల్ ఖుషీ అయిపోయారు.First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు