HBD Kohli : హ్యాపీ బర్త్‌డే కోహ్లీ... రికార్డుల రారాజుకి విషెస్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యూచర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు. (credit - twitter)

#KingKohli : దూకుడైన ఆటతీరుతో... ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... 31వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా... నెటిజన్లు ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.

 • Share this:
  #HappyBirthdayViratKohli : టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ... సోషల్ మీడియాను కుమ్మేస్తున్నాడు. 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కోహ్లీకి... నెటిజన్లు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. ఫలితంగా ట్విట్టర్ టాప్ ట్రెండ్, సెకండ్ టాప్ ట్రెండ్... రెండూ విరాట్ కోహ్లీతోనే నిండిపోయాయి. #KingKohli పేరుతో టాప్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే 21 వేల ట్వీట్లు ఉండగా... సెకండ్ ట్రెండ్ అయిన #HappyBirthdayViratKohliకి 17 వేలకు పైగా ట్వీట్లున్నాయి. అంతకంతకూ ఇవి పెరుగుతున్నాయి. ఎప్పుడూ బర్త్ డే టైమ్‌లో ఫ్యామిలీకి దూరంగా ఉండే రికార్డుల కింగ్... గతేడాది, ఈసారి మాత్రం... కుటుంబంతోనే పుట్టిన రోజు జరుపుకుంటుండటం విశేషం.


  ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఖాళీగా ఉన్నాడు. ఇలా అనే కంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు అనడం బెటర్. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోహ్లీ ఆడట్లేదు. ఆ తర్వాత జరిగే టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అవ్వనున్నా్డు.


  ఇలా రెస్ట్ తీసుకుంటున్న టైమ్‌లో పుట్టిన రోజు రావడంతో... కోహ్లీ ఫ్యామిలీ ఖుషీగా ఉంది. లాస్ట్ బర్త్‌డేని కూడా కోహ్లీ... ఫ్యామిలీతోనే జరుపుకోగలిగాడు. అప్పట్లో భారత్‌లో వెస్టిండీస్‌ టూర్‌ జరుగుతోంది. అప్పుడు కూడా టీ20లలోనే టీమిండియా పోటీపడింది.


  లాస్ట్ ఇయర్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు... ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కి వెళ్లారు. ఈసారి భూటాన్ వెళ్లారు. లాస్ట్ ఇయర్ అనుష్క పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. ఏంటంటే... కోహ్లీని పుట్టించినందుకు దేవుడికి థాంక్స్ అని పెట్టింది.


  ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న కోహ్లీ... 15 ఏళ్ల వయసు నుంచే క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మొదట్లో చాలా మందిలాగే తనూ నానా కష్టాలు పడ్డాడు. అదే సమయంలో విజయాలు కూడా సాధిస్తూ వచ్చాడు. ఇప్పుడు పాకిస్థాన్‌లో ప్రజలు సైతం... తమకు కోహ్లీ కావాలని అంటున్నారు.


  ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ప్రపంచ రెండో బెస్ట్ బ్యాట్స్‌మేన్‌గా ఉన్నాడు. 2008లో అతను అండర్ 19 ఆడుతున్నప్పుడే... అతని టీమ్ వరల్డ్ కప్ సాధించింది.


  పదేళ్ల కాలంలో 20వేల రన్స్ చేసిన మొదటి బ్యాట్స్‌మేన్ కోహ్లీయే. ఈ ఏడాది మొదట్లో వెస్టిండీస్ టూర్‌లో ఈ ఫీట్ సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల రన్స్ చేసిన బ్యాట్స్‌మేన్ కూడా కోహ్లీయే. 2018లో వెస్టిండీస్‌పై ఈ ఫీట్ కూడా సాధించాడు. దీన్ని సచిన్... 259 ఇన్నింగ్స్‌లో సాధించగా... కోహ్లీ 205 ఇన్నింగ్స్‌కే సాధించడం విశేషం.


  ఏడాది కాలంలో వన్డేల్లో 1000 రన్స్ చేసిన రికార్డ్ కూడా కోహ్లీదే. 11 ఇన్నింగ్స్‌లో ఈ మైల్‌స్టోన్ సాధించాడు. 15 ఇన్నింగ్స్‌లో 1000 రన్స్ చేసిన హసీం ఆమ్లాను వెనక్కి నెట్టాడు. వరుసగా మూడేళ్లపాటూ... ఏటా 1000 రన్స్ చొప్పున సాధించిన క్రికెటర్ రికార్డ్ కూడా అతని పేరునే ఉంది. 2016లో 1215, 2017లో 1059, 2018లో 1322 రన్స్ చేశాడు.


  ఓ టెస్ట్ కెప్టెన్‌గా ఉంటూ... ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన క్రెడిట్ కూడా విరాట్ కోహ్లీకే ఉంది. IPLలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 973 (2016లో) సాధించింది కూడా అతడే. కెప్టెన్‌గా ఉంటూ... వన్డేల్లో అత్యంత వేగంగా 3000 రన్స్ చేసింది కోహ్లీ మాత్రమే. 49 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు. తద్వారా డివిలియర్స్, ధోనీలను వెనక్కు నెట్టాడు. ఒకే ఏడాదిలో ఎక్కువ సెంచరీలు చేసింది కూడా అతడే. 2017లో ఏకంగా 11 సెంచరీలు చేశాడు. రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్‌లను వెనక్కు నెట్టాడు. ఇలా కోహ్లీకి ఎన్నో రికార్డులున్నాయి. అందుకే అతడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్నాడు.

   

  Pics : తెలుగు తెరపైకి మరో అందాల కేరళ కుట్టి  ఇవి కూడా చదవండి :

  Pics : ఢిల్లీలో పొగ ఎలా ఉందో ఈ ఫొటోలే చెబుతున్నాయి...


  ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తాజా ప్రకటన...

  నేడు తెలంగాణ బంద్?... నాగోలులో తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు

  మద్యం కొద్దికొద్దిగా తాగితే కలిగే లాభాలేంటి?

  Bigg Boss 3 | శ్రీముఖికి ప్లస్సా, మైనస్సా?
  First published: