RCB New Jersey: కొత్తలుక్ లో కోహ్లీ సేన.. మారిన ఆర్సీబీ జెర్సీ.. ఆ ఒక్క మ్యాచ్ కోసమే...

Photo: RCB (Twitter)

IPL-2021: ఈసారి టైటిల్ పై కన్నేసిన విరాట్ కోహ్లీ (Virat Kohli) నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) రెండోదశ మ్యాచుల్లో సరికొత్త లుక్ లో దర్శనమివ్వనుంది.

  • Share this:
    ఐపీఎల్-2021 సెకండ్ ఫేజ్ (IPL-2021 Second Phase) కోసం అంతా సిద్ధమైంది. జట్లన్నీ మ్యాచ్ లు ఆడేందుకు యూఏఈ చేరుకున్నాయి. ఇంగ్లాండ్ (England)నుంచి నేరుగా దుబాయ్ (Dubai) వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్చెన్నై సూపర్ కింగ్స్ (Mumbai Indians-Chennai Super Kings) జట్ల మధ్య సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈసారి టైటిల్ పై కన్నేసిన విరాట్ కోహ్లీ (Virat Kohli) నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) రెండోదశ మ్యాచుల్లో సరికొత్త లుక్ లో దర్శనమివ్వనుంది. సెప్టెంబర్ 20న కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తో జరిగే మ్యాచ్ కు సిద్ధమవుతున్న ఆర్సీబీ(RCB).. ఈసారి కొత్త మార్పుతో బరిలో దిగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ అండ్ కో కొత్తజెర్సీలో దర్శనమివ్వనుంది.

    బెంగళూరు టీమ్.. కేకేఆర్ తో జరిగే మ్యాచ్ రెడ్ అండ్ బ్లాక్ బదులు... బ్లూ కలర్ జెర్సీతో బరిలో దిగనుంది. ఐతే ఈ కొత్త జెర్సీ లీగ్ మొత్తం ధరించరు.. కేవలం కోల్ కతాతో జరిగే మ్యాచ్ కు మాత్రమే ఆర్సీబీ బ్లూ కలర్ లో దర్శనమివ్వనుంది. ఈ జెర్సీ మార్పుకు వెనుక పెద్దకారణమే ఉంది. కరోనాకు వ్యతిరేకంగా పోరుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మద్దతివ్వడం కోసం ఆర్సీబీ బ్లూ డ్రెస్ ధరిస్తోంది. పీపీఈ కిట్ల రంగును పోలిన జెర్సీతో బరిలో దిగడం ద్వారా ఫ్రంట్ లైన్ కార్మికులకు మద్దతుగా ఉన్నట్లు ఉంటుందని కోహ్లీ సేన తెలిపింది.



    ఐపీఎల్ 2021 ఫస్ట్ ఫేజ్ లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం బ్లూ డ్రెస్ ధరించింది. తాము కేవలం మద్దతుకే పరిమితం కాకుండా వైద్య సౌకర్యాలను బలోపేతం చేయడం కూడా ఆర్సీబీ ఆర్థిక సాయం అందిస్తోందని కింగ్ కోహ్లీ ప్రకటించాడు. ఆర్సీబీ గివ్ ఇండియా ఫౌండేషన్ పేరుతో ఆ ఫ్రాంఛైజీ బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో 100 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది.

    ఇక గత 13 సీజన్లలో ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు జరిగిన ఫస్ట్ ఫేజ్ మ్యాచుల్లో 7 మ్యాచులాడిన ఆర్సీబీ 5 విజయాలు సాధించింది. 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. టాప్-4లో నిలవడం ద్వారా ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకోని.. ఆ తర్వాత టైటిల్ కొట్టాలన్నది కింగ్ కోహ్లీ ప్లాన్. అటు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఈసారి కప్ తమదేనని భావిస్తున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కెప్టెన్ గా విమర్శలెదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి ఈ టైటిల్ విజయం కీలకం కానుంది. మరి యూఏఈలో బ్లూ డ్రెస్ తో ఎంట్రీ ఇస్తున్న కోహ్లీకి కొత్త లుక్ కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published: