Viral Video : పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడుతున్న కోహ్లీ... పడిపడి నవ్వుతున్న నెటిజన్లు

ఈ వీడియోను చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బాబర్ అజమ్ కాదు, కోహ్లీ మ్యాచ్ గెలిపిస్తాడని 2025లో చిన్న పిల్లలకు కూడా తెలుసిన ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: September 5, 2019, 8:16 PM IST
Viral Video : పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడుతున్న కోహ్లీ... పడిపడి నవ్వుతున్న నెటిజన్లు
విరాట్ కోహ్లీ (Twitter Photo)
  • Share this:
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. అయితే, ఇది నిజంగా కాదు. ఓ వైరల్ వీడియోలో. ఆ వీడియో ప్రకారం.. 2025లో టీ 20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఫైనల్స్ మ్యాచ్‌లో పాకిస్తాన్, ఇంగ్లండ్ తలపడతాయి. శ్రీనగర్‌లోని స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు తరఫున కోహ్లీ ఆడుతున్నట్టుగా చిత్రీకరించారు. పాకిస్తాన్ తరఫున ఇద్దరు దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఉన్నారని, బాబర్ అజమ్, విరాట్ కోహ్లీ అంటూ వారి ఫొటోలు చూపిస్తూ బ్యాక్ గ్రౌండ్‌లో వాయిస్ వస్తుంది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ గెలిపిస్తాడంటూ చిన్న పిల్లలు చెప్పడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఆ బాలిక మాటలు విన్న తండ్రి.. విరాట్ కోహ్లీ గతంలో భారత జట్టుకు ఆడేవాడని చెబుతాడు. దీంతో ‘ఇండియా ఎవరు?’ అని ప్రశ్నిస్తుంది. దానికి తండ్రి నవ్వుతాడు. ఇదీ స్థూలంగా ఆ వీడియో సారాంశం. సెప్టెంబర్ 6న పాకిస్తాన్ డిఫెన్స్ డే సందర్భంగా కొందరు ఈ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.


ఈ వీడియోను చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బాబర్ అజమ్ కాదు, కోహ్లీ మ్యాచ్ గెలిపిస్తాడని 2025లో చిన్న పిల్లలకు కూడా తెలుసిన ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. కలకనడానికి కూడా ఓ హద్దు ఉంటుందంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.





First published: September 5, 2019, 8:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading