‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్’ అంటున్న విరాట్, అనుష్క

మరోవైపు కోహ్లీ కూడా ఇద్దరు కలిసున్న ఫోటోలు పెట్టాడు. అయితే అభిమానులు మాత్రం విరుష్క జంట ఫోటోల్ని చూసి తెగ సంబరపడిపోతుంది.

news18-telugu
Updated: February 4, 2019, 8:23 AM IST
‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్’ అంటున్న విరాట్, అనుష్క
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ
news18-telugu
Updated: February 4, 2019, 8:23 AM IST
న్యూజిలాండ్‌లో ఎంజాయ్ చేస్తుంది విరుష్క జంట. ఇండియా-న్యూజిలాండ్ సిరీస్ 4-1 తేడాతీ టీమిండియా సాధించడంతో.. ప్లేయర్స్ అంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్కతో న్యూజిలాండ్‌ అందాల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి చెట్టుపుట్ట తిరగేస్తున్నారు. తమ అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతున్నారు.

అడవిలో తిరుగుతూ... చెట్టు దుంగపై కూర్చొని ఇద్దరు ఫోటోలకు ఫోజులిచ్చారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ అంటూ... ఈ పిక్‌కు కామెంట్ పెడుతూ అనుష్క పోస్టు పెట్టింది. మరోవైపు కోహ్లీ కూడా ఇద్దరు కలిసున్న ఫోటోలు పెట్టాడు. అయితే అభిమానులు మాత్రం విరుష్క జంట ఫోటోల్ని చూసి తెగ సంబరపడిపోతుంది. పెళ్లై... రెండేళ్లు అవుతున్నారు.. ఈ జంట ప్రేమపక్షుల్లా కలిసి మెలిసి ముచ్చటగా తిరిగేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు టీమిండియా విక్టరీపై.. కెఫ్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. కివీస్ గడ్డపై అద్భుతంగా రాణించిన ప్రతీ ఒక్కరిని కోహ్లీ ట్విట్టర్ ద్వారా అభినందించాడు. ‘‘క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడి, అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. గొప్పగా ఆడారు బాయ్స్. జై హింద్’’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.


 
Loading...View this post on Instagram
 

Best friend forever ❤️


A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on
 
View this post on Instagram
 

♥️


A post shared by Virat Kohli (@virat.kohli) on
First published: February 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...