హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మీ కక్కుర్తి పాడుగాను.. కిలో మీటర్ల మేర క్యూ.. ఇసుకేస్తే రాలనంతగా జనాలు.. ఎందుకో తెలుసా..?

మీ కక్కుర్తి పాడుగాను.. కిలో మీటర్ల మేర క్యూ.. ఇసుకేస్తే రాలనంతగా జనాలు.. ఎందుకో తెలుసా..?

స్టోర్ బయట ఎగబడ్డ జనాలు

స్టోర్ బయట ఎగబడ్డ జనాలు

Karnataka: జనాలు భారీ ఎత్తున ఎగబడ్డారు. రోడ్డుపై కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. దాదాపు మూడు గంటల పాటు.. జనాలు లైన్ లలో వేచిచూశారు. అయినప్పటికి రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.

కొంత మందికి షాపింగ్ చేయడమంటే మహా సరదా. ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన షాపింగ్ లు, పార్టీలకు అంటూ అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతుంటారు. డబ్బులను మంచి నీళ్ల మాదిరిగా ఖర్చు చేస్తుంటారు. బట్టలు, షూస్ లు, ఇంట్లో ఫర్నీచర్స్ కొని పాడేస్తుంటారు. ఎక్కడ కొత్తగా షాపింగ్ మాల్ లేదా స్టోర్ కొత్తగా ప్రారంభించిన ఫస్ట్ డేనే అక్కడికి వాలిపోతుంటారు. అవసరం ఉన్నా లేకపోయిన, షాపింగ్ లు చేస్తుంటారు. ఇలాంటి వారిని మనం తరచుగా చూస్తునే ఉంటాం. అయితే, కొత్తగా ప్రారంభించిన ఒక స్టోర్ బయట జనాలు రద్దీగా మారిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (Karnataka)  బెంగళూరులో (Bengaluru)  ఐకీయా స్టోర్ కొత్త ప్రారంభించారు. నాగ సంద్ర ప్రాంతంలో ఐకీయా  (Ikea new store) కొత్త బ్రాంచ్ ను ఆదివారం ప్రారంభించారు. దీంతో జనాలు కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. షోరుమ్ సిబ్బంది కూడా చేతులెత్తేశారు. దీంతో చివరకు ఐకీయా స్టోర్ వారు.. తమ అధికారిక ట్వీటర్ హ్యండిల్ కస్టమర్ లకు రిక్వెస్ట్ చేస్తు పోస్ట్ చేశారు. ప్రస్తుతం రద్దీగా ఉందని, దాదాపు.. మూడు గంటల పాటు సమయం పడుతుందని, ఆన్ లైన్ లో షాపింగ్ సదుపాయం వినియోగించుకొవాలని కోరారు.


దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  తీవ్ర చర్చ నడుస్తోంది. కాగా, దీనిపైన RPG ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తన ట్విట్టర్‌లో (Tweet) ఖాతాలో స్టోర్ ఎదుట ఉన్న రద్దీ వీడియోను షేర్ చేశారు. దానికింద.. “ఇది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి క్యూలో ఉన్న ఎమ్మెల్యేలు కాదు, ఇది మన దేశంలోకి ప్రవేశించడానికి ఇమ్మిగ్రేషన్ క్యూ కాదు.

ఇది కరోనా మహామ్మారి వేవ్‌ను నివారించడానికి టీకా క్యూ కానే కాదని అన్నారు. ఇక కలియుగ దైవం.. వెంకటేశ్వర స్వామి కోసం తిరుపతిలో క్యూలో నిల్చున్న యాత్రికులు అసలు కాదని అన్నారు. వీళ్లంతా ఎవరంటే.. బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన ఐకీయా స్టోర్ IKEA ప్రారంభోత్సవానికి వచ్చిన కస్టమర్లని చమత్కరించారు. జనాలు కిలోమీదర్ల మేర ఎగబడ్డారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (Viral video)  మారింది.

First published:

Tags: Bengaluru, Karnataka, Viral Video

ఉత్తమ కథలు