Video: పెళ్లిలో వధువుకి కోపం తెప్పించారు.. ఆమె ఏం చేసిందో తెలుసా?

పెళ్లిలో వధువుకి కోపం తెప్పించారు (image credit - instagram)

Viral Video: ఏ పెళ్లిలోనైనా వధూవరులు... సంతోషంగా ఉంటారు. ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరుస్తాయి. అక్కడ అలా జరగలేదు. వధువుకి కోపం తెప్పించిందెవరు? ఎందుకలా?

  • Share this:
    Wedding Video: పెళ్లి అన్నాక... వధూవరుల ఫ్రెండ్స్ రావడం... విషెస్ చెప్పి.. ఓ చోట కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కామన్. కొంత మంది వధూవరులను ఏడిపిస్తారు. సరదాగా ఆట పట్టిస్తారు (wedding teasing). అలా చేస్తే... వధూవరులు కూడా పోనీలే అని తేలిగ్గా తీసుకుంటారు. ఇంకొన్ని పెళ్లిళ్లలో వధూవరులు... స్నేహితులతో కలిసి డాన్స్ (dance videos) చేస్తారు. ఇలా పెళ్లి అంటేనే సందడి. కానీ సరదాలు, ఆట పట్టించడాలకు కూడా ఓ హద్దు (limits) ఉంటుంది. అతిగా ఆటపట్టిస్తే... ఆనందం కాస్తా ఆవిరై ఆగ్రహం వస్తుంది. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (viral marriage video) అవుతోంది.

    ఒకటే అల్లరి:
    ఈ వీడియోలో వరుడి ఫ్రెండ్స్ కాస్త ఎక్కువ అల్లరి చేశారు. పెళ్లి జరుగుతుంటే ఓ మూల కూర్చొని ఒకటే జోకులు. "అరేయ్ వీడికి పెళ్లైపోతుంది" అంటూ కామెంట్స్. అవి మరీ శృతిమించిపోయాయి. అయినా సరే... అవేవీ పట్టించుకోకుండా... వరుడు వధువు మెడలో పూలమాల (garland) వేశాడు. ఇక వధువు వెయ్యాలి. సరిగ్గా అప్పుడే... టీజింగ్ మొదలుపెట్టారు.

    వధువు రియాక్షన్:
    ఆమెను టార్గెట్ చేస్తూ పకపకా నవ్వుతుంటే... ఆమెకు పిచ్చి కోపం (bride gets angry) వచ్చింది. ఆ క్షణం ఆమె వారి వైపు కోపంగా చూసింది. అంతలోనే కంట్రోల్ చేసుకొని దండ వేద్దామనుకుంటే... మళ్లీ అదే టీజింగ్. వేసే దండను కాస్తా వెనక్కి తీసుకొని... "నాకీ పెళ్లే వద్దు" అనే స్థాయిలో కోపంగా చూసిందామె. ఆ తర్వాత "వీళ్లు మారరు" అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి పూలమాల వేసింది.

    ఆ వీడియో ఇక్కడ చూడండి.



    ఈ వీడియోను నిరంజన్ మహాపాత్ర... ఇన్‌స్టాగ్రామ్ ‌అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీన్ని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీన్లో బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టిన సాంగ్... సిచ్యువేషన్‌కి సింకై బాగా నవ్విస్తోంది (laughing video). దీన్ని ఇప్పటికే 1.6 లక్షల మంది చూశారు. 750 మందికి పైగా లైక్ చేశారు.

    ఇది కూడా చదవండి: బార్బీలా కనిపించాలని రూ.24 లక్షలు ఖర్చుచేసింది.. తీరాచూస్తే ఇలా అయ్యింది!

    నిజానికి పెళ్లికి వచ్చిన వాళ్లకు అంత ఓవరాక్షన్ పనికిరాదు. ఆ విషయాన్ని ఒప్పుకుంటూనే నెటిజన్లు... తేలిగ్గా తీసుకుంటున్నారు. పెళ్లైపోయింది కదా... ఆగిపోలేదు కదా... పోనీలే అనుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: