Wedding Card : పెళ్ళికి చుట్టాలు, సన్నిహితులను పిలిచేందుకు రకరకాల ఆహ్వాన పత్రికలను అచ్చువేయించడం చూశాం. ఆ ఆహ్వాన పత్రికలను కూడా తమ తమ అభిరుచుల మేరకు అచ్చువేయిస్తుంటారు. అయితే, ఇప్పుడు చెప్పుకునే పెళ్లి పత్రికను చూస్తే మీరు వారెవ్వా అనకుండా ఉండలేరు.
పెళ్ళంటే (Marriage) నూరేళ్ల పంట అంటారు. అయినవారందరిని పిలుచుకొని, బంధువులు, స్నేహితుల నడుమ కలకాలం గుర్తిండి పోయేలా పెళ్లి తంతును అంగరంగ వైభవంగా జరుపడం చూస్తున్నాం. పెళ్లిలో వేసుకొనె బట్టలు మొదలు కొని పెళ్ళి మండపం అలంకరణ, పెళ్ళిలో వడ్దించే భోజనం వరకు అన్నింట్లో ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం ఎంతైన ఖర్చు చేయడంలో వెనుకకు రావడం లేదు. అయితే పెళ్ళికి చుట్టాలు, సన్నిహితులను పిలిచేందుకు రకరకాల ఆహ్వాన పత్రికలను అచ్చువేయించడం చూశాం. ఆ ఆహ్వాన పత్రికలను కూడా తమ తమ అభిరుచుల మేరకు అచ్చువేయిస్తుంటారు.
పత్రికలు అందుకున్న వారు కూడా పెళ్లి ముహుర్తం ఎప్పుడు, వేదిక ఎక్కడ చూసుకునేందుకు పెళ్ళి అయ్యె వరకు భద్రంగానే ఉంచుతారు. కానీ, ఆ గ్రామంలోని గ్రామస్తులు ఓ పెళ్లి కార్డు (Marriage Invitation Card) అందుకుని అవాక్కవుతున్నారు. ఇంతకీ.. ఎందుకు గ్రామస్తులు అవాక్కవుతున్నారు. అసలు ఆ పెళ్లి కార్డులో ఏముంది.. ఎందుకు గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారో తెలుసుకుందాం.
900 కుటుంబాలకు స్వయంగా వెళ్లి పెళ్లి కార్డు అందిస్తోన్న రమేష్
తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలోని తిరువిడైమరుదూరు సమీపంలో మల్లాపురం పంచాయతీ ఉంది. ఇక్కడ కౌన్సిల్ చైర్మన్ రమేష్. ఆయన రెండోసారి మళ్లీ ఎన్నికయ్యారు. అతని పంచాయతీలో మల్లాపురం, కాచుకట్టు, తిరుమలరాజపురం, దిగువ తిరుమలరాజపురం మరియు విల్ వెలంగుడి గ్రామాల పరిధిలో 900 కుటుంబాలు ఉన్నాయి. ఆయన కుమార్తె షాలిని కైలాష్ వివాహం ఈ నెల 24వ తేదీన కుంభకోణంలో జరగనుంది.
అతన్ని రెండో సారి గెలిపించిన గ్రామస్తుల్ని కుటుంబ సభ్యులుగా భావించాడు. దీంతో.. తన కూతురి పెళ్లి ఆహ్వాన పత్రికలో అందరి గ్రామస్తుల, బంధువుల పేర్లను సుమారు 900 పేర్లు ముద్రించి అందరికీ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా 900 కుటుంబాలతో ఇంటింటికీ వెళ్లి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నాడు. తాను ఇచ్చిన వివాహ ఆహ్వాన పత్రికలో 900 మంది కుటుంబ పెద్దల, పేర్లతో పాటు వారికి శుభాకాంక్షలు తెలిపే బంధువుల పేర్లను కూడా ముద్రించారు.
పంచాయితీ ప్రెసిడెంట్ రమేష్ ఇచ్చిన వార్తాపత్రికను చూసిన గ్రామ ప్రజలు అవాక్కయ్యారు. అందరూ పెళ్లి పత్రికలో తమ బంధువుల పేర్లు మాత్రమే ముద్రిస్తుండగా.. రమేష్ మాత్రం మంచి మనసుతో ఆలోచించాడు.తన కుటుంబ వివాహ ఆహ్వాన పత్రికలలో గ్రామంలోని వారందరి పేర్లను ముద్రించాడు. కుల, మతాలకు అతీతంగా అందరూ ఒకే కుటుంబం అన్న నానుడిని ఈ పెళ్లి పత్రిక ద్వారా తెలిపారు. ఇక, రమేష్ చేసిన పనిని చూసి అందరూ గ్రామస్తులు అభినందిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.