Home /News /trending /

VIRAL VIDEOS TWO CROW VIDEOS RUNNING IN SOCIAL MEDIA WITH MORE VIEWS AND LIKES WATCH THOSE TWO VIDEOS HERE NK

Viral Videos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న కాకుల వీడియోలు... నెటిజన్లు ఫిదా

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న కాకుల వీడియోలు (credit - twitter)

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న కాకుల వీడియోలు (credit - twitter)

Viral Videos: మిగతా పక్షులకూ కాకులకూ ప్రధాన తేడా ఒకటుంది. కాకులు ఎంతో తెలివైనవి. మనలాగా ఆలోచిస్తాయి. ఈ వైరల్ వీడియోలను చూస్తే అవునని మీకే అనిపిస్తుంది.

    Viral Videos: వైరల్ వీడియోలు మనకు కొత్తేమీ కాదు. రోజూ చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని మనకు బాగా నచ్చుతాయి. కొన్ని సరదాగా ఉంటే... మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అలాంటి రెండు వీడియోల గురించి ఇప్పుడు మనం సింపుల్‌గా చర్చించుకుందాం. మొదటి వీడియో బాగా వైరల్ అయ్యింది. అందులో ఓ కాకి... క్యాట్ వాక్ (crow cat walk) చేసింది... "కాకి వాక్" గా, క్రౌ వాక్ (Crow walk)గా అది వైరల్ అయ్యింది. ర్యాంప్‌పై మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తారు. దాన్నే క్యాట్ వాక్ అంటారు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ వంటి పోటీలు జరిగినప్పుడు... ఈ క్యాట్ వాక్‌కి ప్రత్యేక మార్కులుంటాయి. ఎవరైతే... పిల్లిలా నడుస్తారో.. వారికే ఎక్కువ మార్కులు వస్తాయి. ఇక్కడ కాకి కూడా... సేమ్ అలాగే... క్యాట్ వాక్ చేసింది. ఓ సన్నటి గోడపై... వాక్ చేస్తూ వెళ్లింది.

    ఇది చూసిన నెటిజన్లు సూపర్ మోడల్ కాకి అనీ... కాబోయే మిస్ యూనివర్శ్ అని రకరకాలుగా సరదా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో మీరూ చూడండి. చిన్నదే ఉంది.


    ఈ కాకిలాగే ఈ మధ్య ఓ ఆవు (cow cat walk) కూడా క్యాట్ వాక్ చేసింది. ఈ వీడియో కూడా ఆ మధ్య వైరల్ అయ్యింది. బహుశా ఇది మీరు చూసే ఉంటారు.


    ఇక రెండో కాకి వీడియో మనల్ని ఆలోచనలో పడేసేది. ఎందుకంటే కాకులు మనలా ఎలా ఆలోచిస్తున్నాయి అనే ప్రశ్న మరోసారి ఈ వీడియో ద్వారా తెరపైకి వచ్చింది. ఇందులో ఓ కాకికి దాహం వేసింది. ఎండాకాలం కదా... ఎక్కడా నీరు లేవు. చిన్నప్పటి కథల్లో లాగా... కుండలో రాళ్లు వేసి... నీళ్లను పైకి తెచ్చుకుందామంటే... ఆ ఛాన్సూ లేదు. కుండలు కనిపించలేదు. దాంతో... ఓ కుళాయిని చూసింది. దాని పంప్‌ని పక్కకు తిప్పితే నీరు వస్తాయని తెలివిగా తెలుసుకుంది. అచ్చం మనలాగే పంప్‌ని బలంగా పక్కకు తిప్పింది. నీరు వచ్చాక... తాగి దాహం తీర్చుకుంది. ఆ వీడియో మీరూ చూడండి.





    ఇది కూడా చదవండి: Viral Bike Stunt Video: బైక్ స్టంట్ చేస్తుండగా... తేడా కొట్టింది... ఆ క్షణంలో...

    మనం మనుషులం కాబట్టి... మనకు పెద్ద మెదడు ఉంటుంది... దాన్లో రకరకాల ఆలోచనలు, తెలివితేటలూ ఉంటాయి. మనలా ఆలోచించే ప్రాణులు చాలా తక్కువ. డాల్ఫిన్లు, చింపాజీలు, కాకుల వంటివి ఇలా ఆలోచిస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాం. మొత్తానికి కాకుల పేరుతో మనం మంచి వీడియోలు చూసినట్లైంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: VIRAL NEWS, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు