మ్యాజిక్ ట్రిక్స్(Magic Tricks) అంటే నచ్చని వారు ఎవరూ ఉండరు, వాటిని చూసే జనాల ముఖాలపై అనిపించే హావభావాలు మరింత విచిత్రంగా ఉంటాయి. మరి అలాంటి మ్యాజిక్ ట్రిక్స్‌కు జంతువులు(Animals) కూడా రియాక్ట్(React) అవుతాయా? ఏమో తెలియదు కాని, మెక్సికో(Mexico) నగరంలో ఒక కోతి రియాక్షన్ మాత్రం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. మెక్సికో సిటీలోని క్యాపుల్ట్‌పెక్ జూలో జూలో ఉండే ఒక కోతి, మనిషి చేసిన మాయజాలానికి బిత్తరపోయింది. మేజిషియన్ మ్యాక్సిమిలానో ఇబ్బారా చేసిన మ్యాజిక్ ట్రిక్స్‌కు కోతి ఇచ్చిన రియాక్షన్ నెటిజన్ల పొట్ట చెక్కలయ్యేలా చేస్తోంది.టిక్ టాక్‌లో పోస్టు చేసిన ఈ వీడియోలో ఒక మేజిషియన్ గ్లాస్ విండో నుంచి జంతువులకు కొన్ని ట్రిక్స్ చూపించాడు. ఒక చిన్న ఆకులాగ కనిపిస్తున్న దానితో మేజిషియన్ కోతి దృష్టిని ఆకర్షించారు.
Cricket Rules: క్రికెట్ రూల్స్ మార్చిన రెండు సంఘటనలు.. ఆటలో ఎలాంటి మార్పులు వచ్చాయంటే..?
ఆ తర్వాత చేత్తో కొన్ని సైగలు చేస్తూ హఠాత్తుగా మాయమవుతాడు. మ్యాజిక్ షో జరగడం, హఠాత్తుగా మనిషి మాయమవడం వంటివాటికి కోతి రియాక్ట్ అయిన తీరు వైరల్‌గా మారింది. TikTok యూజర్ @pedro14mx పోస్టు చేసిన ఈ వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియా..
ఆ మేజిషియన్ తన చేతిలో ఒక ఆకును చూపిస్తూ, మాయం చేస్తూ ఉండటంతో గాబరా పడిన కోతి ఏం చేయాలో అర్థంకాక ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకొని అటు ఇటు పరిగెత్తసాగింది. మ్యాజిక్ ట్రిక్కులకు అది ఆశ్చర్యపోయి మనిషిలాగా హావాభావాలు ప్రదర్శించడం చాలా మందిని ఆకట్టుకుంది. మనిషి మాయమైపోగానే అది ఇచ్చిన రియాక్షన్ నిజంగా భలే ఆకట్టుకుంటోంది. 52 సెకన్ల ఈ వీడియోను చూసి చాలా మంది రకరకాల కామెంట్లు చేశారు. కోతి రియాక్షన్‌ను వెలకట్టలేం.
జూలో జంతువులు ఎప్పుడు బంధించే ఉంటాయి, మీరు చేసిన ట్రిక్స్ వాటిని బాగా ఆకట్టుకున్నాయని మేజిషియన్ మ్యాక్సిమిలానో ఇబ్బారాను అభినందించారు. మరో అబ్బబ్బ కోతి ఎంత ముద్దొస్తుందో అని మరో యూజర్ పులకరించిపోయారు. కోతి రియాక్షన్ చూసిన మరో యూజర్ మీ మనుషుల మాయాజాలం నా ముందు చూపించొద్దని కోతి అంటోందని కామెంట్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news, Viral tweet, Viral Video