• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEOS THESE GIRLS CAME OUT FROM HOUSE DURING CURFEW TIMES THEN MADHYA PRADESH POLICE TOOK ACTION WATCH VIDEO NK

Viral video: అమ్మాయిలకు పనిష్మెంట్... గుంజీలు తీయించారు... ఏం తప్పు చేశారంటే...

Viral video: అమ్మాయిలకు పనిష్మెంట్... గుంజీలు తీయించారు... ఏం తప్పు చేశారంటే...

Viral video: అమ్మాయిలకు పనిష్మెంట్... గుంజీలు తీయించారు... ఏం తప్పు చేశారంటే...

Viral video: ఈ కరోనా రోజుల్లో అబ్బాయిలు తప్పు చేస్తుంటే... పోలీసులు పట్టుకొని... గుంజీలు, ఇతరత్రా శిక్షలు, ఫైన్లూ వేయడం చూస్తున్నాం. ఇది మరో టైపు. అమ్మాయిలకు పనిష్మెంట్ ఇచ్చారు. ఏం జరిగిందో తెలుసుకుందాం.

  • Share this:
    Viral video: దేశంలో కరోనాను కంట్రోల్ చేయడానికి మరో మార్గం లేదంటూ... చాలా రాష్ట్రాలు కర్ఫ్యూలు, ఆంక్షలు, లాక్‌డౌన్ల వంటివి విధిస్తున్నాయి కదా. ఇలాంటి సమయంలో ఉత్తినే ఇళ్లలోంచీ బయటకు రావొద్దని పోలీసులు మరీ మరీ చెబుతున్నారు. ఇలాంటి వాటిని కుర్రాళ్లు పెడ చెవిన పెట్టడం, బయట తిరుగుతూ పోలీసులకు దొరికిపోవడం వంటివి చూస్తూనే ఉన్నాం. అయితే... ఈ రోజుల్లో అబ్బాయిలే కాదు... కొందరు అమ్మాయిలు కూడా కరోనా తమను ఏం చేయలేదు అంటూ ఉత్తినే రోడ్లపై తిరుగుతున్నారు. మరి వాళ్లను వదిలేస్తారా... శిక్షించరా అని మగాళ్లు ప్రశ్నిస్తుంటే... చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అంటూ పోలీసులు వారికీ పనిష్మెంట్ ఇచ్చారు.

    సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పనిష్మెంట్ ఘటన జరిగింది మధ్యప్రదేశ్‌లోని చందేరీ జిల్లాలో. అక్కడి అశోకా నగర్‌లో అమ్మాయిలు గుంజీలు తీస్తుంటే... అందరూ నోరెళ్లబెట్టి ఆశ్చర్యంగా చూశారు. అక్కడి ఓ వీధిలో పోలీసులు 144 సెక్షన్, కర్ఫ్యూ రూల్స్ అమలయ్యేలా చేస్తున్నారు. ఇంతలో ఈ అమ్మాయిలు పనీ పాటా లేకుండా ఉత్తినే తిరుగుతుంటే పోలీసులు ఆపారు. ఎందుకు తిరుగుతున్నారు అంటే వాళ్లు ఏదేదో చెబుతున్నారే తప్ప.. కచ్చితమైన ఆన్సర్ లేదు. నిత్యవసరాల కోసం బయటకు వస్తే పర్లేదు కానీ... ఊరికే ఊరిపై పడి తిరగడానికి వస్తే ఎలా అంటూ పోలీసులు... గుంజీలు తియ్యండి అన్నారు. సార్... ప్లీజ్ అని అమ్మాయిలు బతిమలాడితే... ఇవన్నీ కుదరవు... ఊ తియ్యండి... అని వారితో గుంజీలు తియ్యించారు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్. ఆ వీడియో ఇక్కడ చూడండి.

    జనరల్‌గా పోలీసులు... అమ్మాయిలకు శిక్షలు వెయ్యరు. అబ్బాయిలను మాత్రం పట్టుకొని వాయిస్తారు. ఇక్కడ మాత్రం పోలీసులు అమ్మాయిలపై జాలి చూపకుండా... పనిష్మెంట్ ఇవ్వడం సెన్సేషన్ అయ్యింది. పోలీసులు చేసింది కరెక్టే అంటున్నారు చాలా మంది. ఈ రోజుల్లో మగవాళ్లతో అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు... రోడ్లపై ఉత్తినే తిరిగే విషయంలోనూ పోటీ పడుతున్నారని అంటున్నారు. అందువల్ల కరోనా కంట్రోల్ అవ్వాలంటే... వాళ్లను కూడా కంట్రోల్ చెయ్యాలని కోరుతున్నారు.

    ఇది కూడా చదవండి: Horoscope 3-5-2021: రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది.

    ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 88,511 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొన్న కొత్తగా 12వేల దాకా కొత్త కేసులు వచ్చాయి. 102 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,718కి చేరింది. అందుకే అక్కడి పోలీసులు యాక్షన్‌లోకి దిగారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు