హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video: వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?

Video: వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?

Video: వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?  (image credit - youtube)

Video: వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా? (image credit - youtube)

Video: యూట్యూబ్‌లో ఓ కొత్త వంటల ఛానెల్ దుమ్మురేపుతోంది. అందులో ఉన్నవి అంతా కలిపి ఐదు వీడియోలే. కానీ నెటిజన్లు తెగ చూస్తున్నారు. ఎందుకో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది.

Video: మనందరికీ తెలుసు యూట్యూబ్‌లో రకరకాల వంటల వీడియోలు ఉంటాయని. వాటిలో విలేజ్ వంటలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే... ఆ ప్రకృతిలో సహజమైన స్టవ్‌లపై సహజమైన పద్ధతుల్లో భారీ ఎత్తున వంటలు వండుతుంటారు. అవి చూసేందుకు ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి నెటిజన్లు వాటిని బాగా ఇష్టపడతారు. ఐతే... బెంగాల్‌కి చెందిన యూట్యూబ్ ఛానెల్ (Unique Village Food) మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. చూసినవాళ్లే మళ్లీ మళ్లీ ఆ వంటలు చూస్తున్నారు. ఆ వంటలు చేసే మహిళ... వేసుకున్న డ్రెస్ వల్లే ఇలా జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైకి ఆమె వంటలే చేస్తున్నా... ఇన్‌డైరెక్టుగా ఆమె అందాలు ఆరబోస్తోందనే వాదన వినిపిస్తోంది.

ఈ ఛానెల్ జులై 20, 2020న ప్రారంభమైంది. ఇందులో ఇప్పటివరకూ 5 వంటల వీడియోలు మాత్రమే ఉన్నాయి. అన్నీ శాఖాహార వంటల వీడియోలే. వ్యూస్ మాత్రం 25 లక్షలకు పైగా వచ్చాయి. అంటే ఒక్కో వంట వీడియోనీ యావరేజ్‌గా 5 లక్షల మంది చూసినట్లు లెక్క. అంటే చాలా ఎక్కువ వ్యూస్ సాధించినట్లే. దీనంతటికీ కారణం స్కిన్ షోనే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Video: వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా? (image credit - youtube)

ఈ ఛానెల్‌కి 63వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పేరుకు తగ్గట్టే... డిఫరెంట్‌ స్టైల్‌లో వంటలు చేస్తామని తెలిపారు. మరీ ఇంత డిఫరెంట్‌గా చేస్తారని ఎవరు ఊహిస్తారు. జనరల్‌గా మన తెలుగు యూట్యూబ్ వంటల్లో చాలా ఛానెళ్లలో మనుషులే కనిపించరు. వంట మాత్రమే చూపిస్తారు. అది చాలా పద్ధతైన విధానం. కానీ... వీళ్లు వ్యూస్ కోసమే ఈ ఎత్తుగడ వేశారనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వస్తోంది.

Video: వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా? (image credit - youtube)

రింపీ... బంగాళాదుంపతో వంట చేస్తూ... ఓ వీడియోని అప్‌లోడ్ చేశాక... అది వైరల్ అయ్యింది. దాంతో రింపీ ఫేమస్ అయ్యింది. ఇలా ఆమె ఏ వీడియో అప్‌లోడ్ చేసినా ఆబగా చూసేస్తున్నారు నెటిజన్లు. మూడు వారాల కిందట ఆమె తాజాగా పెట్టిన వంట వీడియో కూడా సూపర్ వైరల్ అయిపోయింది.

రింపీకి సోషల్ మీడియాలో కూడా యూజర్లు విపరీతంగా పెరిగిపోయారు. గ్యాస్ సిలిండర్‌పై ఆరు బయట ఆమె వంటలు వండుతోంది. ప్రతి వీడియోలోనూ ఆమె ఎద అందాలపైనే కుర్రాళ్ల కళ్లు పడుతున్నాయి. ఈ హాట్ అవతారం కోసం యూత్ ఎగబడుతున్నారు. బంగాళాదుంప పేస్ట్, వంకాయ పేస్ట్, టమాటా పేస్ట్, ఎగ్ కర్రీ, పచ్చడి వంటి వీడియోలు ఆమె అప్‌లోడ్ చేసింది.

Video: వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా? (image credit - youtube)

ఇది కూడా చదవండి: Horoscope 31-7-2021: నేటి రాశి ఫలాలు.. ఉద్యోగ మార్పులు, పురోగతి

జనరల్‌గా బెంగాలీల్లో ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు. చేపల్ని ఇష్టంగా ఆరగిస్తారు. కానీ... అదే బెంగాల్‌లో వేగాన్ ఫుడ్ (పూర్తి శాఖాహారం) వీడియోలు వైరల్ అవ్వడమేంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రజలపై బలవంతంగా వేగాన్ ఫుడ్‌ని రుద్దేందుకు చేసే ప్రయత్నం ఇది కావచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఓవైపు ట్రోలింగ్ వస్తూ... మరోవైపు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

First published:

Tags: Bengal, VIRAL NEWS, Viral Videos

ఉత్తమ కథలు