• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEOS KHABY LAME FIXING WRONG LIFE HACK VIDEOS ON TIKTOK WITH HIS SIMPLE REALISTIC HELPFUL SOLUTIONS NK

Viral videos: టిక్‌టాక్ లైఫ్ హ్యాక్ వీడియోలకు షాక్... వైరల్ అవుతున్న ఖాబీ లేమ్ టిప్స్

Viral videos: టిక్‌టాక్ లైఫ్ హ్యాక్ వీడియోలకు షాక్... వైరల్ అవుతున్న ఖాబీ లేమ్ టిప్స్

టిక్‌టాక్ లైఫ్ హ్యాక్ వీడియోలకు షాక్... వైరల్ అవుతున్న ఖాబీ లేమ్ టిప్స్ (image credit - instagram)

Viral videos: ఖాబీ లేమ్ వీడియోలు చూసిన వారు... ఎస్ ఇదీ పద్ధతంటే అంటున్నారు. ఇన్నాళ్లూ తామే టిక్‌టాక్ స్టార్లం అని చెప్పుకుంటున్న వారు ఖాబీ లేమ్ వీడియోలు చూసి షాక్ అవుతున్నారు.

  • Share this:
    Viral videos: ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక... లైఫ్ హ్యాక్ వీడియోలు ఎక్కువయ్యాయి. వీటిలో చాలా వరకూ సమాజానికి మేలు చేసేవే ఉంటున్నాయి. కొన్ని మాత్రం సమాజాన్ని చెడగొడుతున్నాయి. అలాంటి వీడియోలు టిక్‌టాక్‌లో లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిని చూసి చిరాకొచ్చిన ఖాబీ లేమ్ (Khaby Lame). వాటికి తనదైన శైలిలో చెక్ పెడుతున్నాడు. అర్థం పర్థం లేని వీడియోల్లో టిక్ టాక్ స్టార్లు చేస్తున్న పిచ్చి పనులను ఖండిస్తూ... అలా కాదు.. ఇలా చేస్తే సరిపోతుంది కదా అని చేసి చూపిస్తున్నాడు. దీంతో... అతని వీడియోలకు నెటిజన్లు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ప్రస్తుతం అతను ఇంటర్నెట్ ఫేవరెట్ అయిపోయాడు. నెటిజన్లు అతన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

    ఇంతకీ ఇతను ఎవరంటే... ఇటలీకి చెందిన టిక్ టాక్ స్టార్. పూర్తి పేరు ఖబానే లేమ్... ఖాబీ లేమ్‌గా పేరొచ్చింది. కొన్ని రోజులుగా ఇతను ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాడు. ఇంతకుముందు టిక్ టాక్ స్టార్లు కొంత మంది చేసిన చెత్త పనులను ఖండిస్తూ... ఇతను కొత్త వీడియోలు చేస్తున్నాడు. ఇది కదా పద్ధతంటే అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఆ వీడియోలు మీరూ చూడండి.


    ఖాబీ లేమ్... వీడియోల్లో ఎక్స్‌ట్రాలు లేవు. ఉన్నది ఉన్నట్లు చూపిస్తున్నాడు. ఓవరాక్షన్ అన్నదే లేదు. అసలు డైలాగ్సే లేకుండా... ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెబుతున్నాడు. ట్విట్టర్‌లో అతనికి ఈ సంవత్సరమే 3 లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు. మీ సమస్యలకు నేను పరిష్కారం చూపిస్తా అని అతను ఓ క్యాప్షన్ వీడియో పెట్టాడు. అది దుమ్మురేపింది.










    ఇప్పటివరకూ కొంత మంది సో కాల్డ్ టిక్ టాక్ స్టార్లు చేసిన పిచ్చి పిచ్చి పనులకు ఇప్పుడు బ్రేక్ పడుతోంది. లైఫ్ హ్యాక్స్ అంటే ఇవీ అని ఖాబీ లేమ్‌ వీడియోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు.








    View this post on Instagram






    A post shared by Khaby Lame (@khaby00)













    View this post on Instagram






    A post shared by Khaby Lame (@khaby00)













    View this post on Instagram






    A post shared by Khaby Lame (@khaby00)





    ప్రస్తుతం ఖాబీ లేమ్ ఫేస్‌ని నెటిజన్లు మీమ్స్ కోసం వాడుకుంటున్నారు. అతని ఎక్స్‌ప్రెషన్స్ వారికి బాగా ఉపయోగపడుతున్నాయి.







    ఇది కూడా చదవండి: Corona: ఆవలింతలు వస్తున్నాయా.. అయితే మీరు ఆప్రమత్తం అవ్వాల్సిందే.. లైట్ తీసుకోవద్దు

    21 ఏళ్ల ఖాబీ లేమ్‌కి టిక్‌టాక్‌లో 4.5 కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి 10 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. నిజాయితీతో చేసే లైఫ్ హ్యాక్స్‌కి నెటిజన్లు బ్రహ్మరథం పడతారనేందుకు ఇతను నిదర్శనంగా మారాడు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు