• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEOS GOLGAPPAS SHOP OWNER FEED GOLGAPPAS TO COWS VIDEO SHARP VIRAL ON SOCIAL MEDIA NK

Viral videos: పానీపూరీ ఇష్టంగా తింటున్న ఆవులు... వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్

Viral videos: పానీపూరీ ఇష్టంగా తింటున్న ఆవులు... వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్

పానీపూరీ ఇష్టంగా తింటున్న ఆవులు (image credit - instagram)

Viral videos: కొన్నికొన్ని దృశ్యాలు చూసినప్పుడు మనసుకు హాయిగా అనిపిస్తుంది కదా... ఈ వీడియో అలాంటిదే. దీన్ని ప్రశాంతంగా చూశారంటే... మళ్లీ చూడాలి అనిపించడం సహజం. ఎందుకో తెలుసుకుందాం.

  • Share this:
    Viral videos: పానీపూరీ చాలా మందికి ఇష్టమైన స్నాక్. చిన్న పూరీలో బఠాణీలు, ఉల్లి కట్లెట్ వేసి... నిమ్మరసంలో ముంచి ఇస్తే... నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే దాని టేస్టే వేరు. అందుకే... పానీపూరీ అంటే మనకే కాదు... జంతువులకూ నచ్చుతుంది. ఉత్తరప్రదేశ్... లక్నోలో... రెడ్ హిల్ కాన్వెంట్ స్కూల్ ఉంది. అక్కడ ఓ పానీపూరీ బండి ఉంది. అక్కడకు ఆవు, దూడ వచ్చాయి. పానీ పూరి ఓనర్ ఏమైనా పెడతాడేమో అని చూశాయి. అతను అందరికీ పెట్టినట్లే... ఆవులకు కూడా పానీ పూరీ పెట్టడం ప్రారంభించాడు. వాటికి నోట్లో పెట్టుకోవడం రాదు కదా... అందువల్ల అతనే వాటి నోట్లోకి వన్ బై వన్ పానీ పూరీలను పెడుతున్నాడు. అలా అతను పెడుతుంటే... ఆ ఆవులు ఎంతో ఆనందంతో వాటిని తిన్నాయి.

    మనకు ఏదైనా నచ్చితే... ఆనందం వ్యక్తం చేయడానికి నవ్వుతాం. ఇక్కడ ఆవులకు ఆ పానీ పూరీ నచ్చడంతో... అవి మళ్లీ మళ్లీ వాటిని తింటూ.. ఎంతో ప్రశాంతంగా ఉంటూ.. తన సంతోషాన్ని అలా వ్యక్తం చేశాయి. ఓ గిన్నెలో ఉన్న పానీపూరీలన్నీ పెట్టేసినా... ఇంకా ఆవులకు తనివి తీరలేదు. దాంతో... మరో ప్లేటులో కూడా పానీపూరీలను తెప్పించి... వాటిని కూడా ఆవులకు పెట్టాడు. కరోనా కారణంగా తన వ్యాపారం దెబ్బతిన్నా... గోమాతల ఆకలి తీర్చాలనే అతని మంచి మనసు గొప్పది కదా.








    View this post on Instagram






    A post shared by sree130920 (@sree130920)






    మన ఇళ్ల దగ్గర చాలా మంది ఆవుల కోసం ఆహారం ఉంచుతుంటారు. అటుగా ఆవు వస్తే... వాటిని తింటుంది. ఇక్కడ పానీ పూరీ వ్యాపారి... నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో... వైరల్ అయ్యింది. ఇప్పటికే దీన్ని 7 లక్షల మందికి పైగా చూశారు. 63వేలకు పైగా లైక్స్ వచ్చాయి. మంచి అంకుల్, మనసున్న మారాజు, చాలా బాగుంది, అమేజింగ్, ఆసమ్, వావ్ నైస్, ఈ రోజు బెస్ట్ వీడియో, అంకుల్ చల్లగా ఉండాలి.. అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

    ఇది కూడా చదవండి:Zodiac Signs: అద్భుత శక్తి కలిగి ఉండే రాశులు... ఏదైనా ఇట్టే పసిగట్టేస్తారు

    సో... ఈ వారం బెస్ట్ వైరల్ వీడియోల్లో దీన్ని మనం చేర్చుకోవచ్చు. నెటిజన్లు మరోసారి ఓ మంచి వీడియోను హైలెట్ చేశారు అనుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు