#BottleCapChallenge : వీడియోలతో దుమ్మురేపుతున్న సెలబ్రిటీలు..

. ఇంతకీ ఈ చాలెంజ్‌లో ఏం చేస్తారంటే.. ముందుగా ఓ బాటిల్‌ను టేబుల్‌పై పెట్టాలి. బాటిల్ మూతను కాస్త వదులుగా పెట్టాలి.

news18-telugu
Updated: July 5, 2019, 5:38 PM IST
#BottleCapChallenge : వీడియోలతో దుమ్మురేపుతున్న సెలబ్రిటీలు..
బాటిల్ క్యాప్ చాలెంట్ చేస్తున్న అక్షయ్, అర్జున్ (Image : Twitter)
  • Share this:
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనంతో అందరి దృష్టిలో పడాలని కోరుకునేవాళ్ల సంఖ్య పెరిగింది. అందులో భాగంగానే ‘ఫిట్‌నెస్ చాలెంజ్’, గ్రీన్ చాలెంజ్’, ‘కికి చాలెంజ్’ వంటివి తెర మీదకు వచ్చాయి. తాజాగా ఇదే తరహాలో మరో కొత్తరకం చాలెంజ్ తెర మీదకు వచ్చింది. ఆ చాలెంజ్ పేరు బాటిల్ క్యాప్ చాలెంజ్. ఇప్పుడీ చాలెంజ్‌ను యువత క్రేజీగా ఫీలవుతున్నారు. ఇంతకీ ఈ చాలెంజ్‌లో ఏం చేస్తారంటే.. ముందుగా ఓ బాటిల్‌ను టేబుల్‌పై పెట్టాలి. బాటిల్ మూతను కాస్త వదులుగా పెట్టాలి.అనంతరం దానికి కొద్దిపాటి దూరంలో నిలబడి బాటిల్ కిందపడకుండా.. కేవలం దాని మూత మాత్రమే ఊడిపోయేలా కాలితో తన్నాలి. ఒక్కరితో మొదలైన ఈ చాలెంజ్.. త్వరలోనే అందరికీ పాకింది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఇప్పుడీ చాలెంజ్‌ను ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.First published: July 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు