హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video: ఫ్రస్ట్రేషన్‌లో కోట్ల ఖరీదైన బెంజ్ కారును తగలబెట్టిన యూట్యూబర్

Video: ఫ్రస్ట్రేషన్‌లో కోట్ల ఖరీదైన బెంజ్ కారును తగలబెట్టిన యూట్యూబర్

తగలబడుతున్న బెంజ్ కారు (Screen Grab)

తగలబడుతున్న బెంజ్ కారు (Screen Grab)

తన కారును తీసుకుని వెళ్లి ఓ ఖాళీ పొలంలో పార్క్ చేశాడు. దాని మీద పెట్రోలో పోశాడు. అనంతరం లైటర్‌తో నిప్పు అంటించాడు. ఈ తతంగం మొత్తం అతడు వీడియో తీసి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశాడు.

ఓ యూట్యూబర్ ఏకంగా మెర్సిడెజ్ బెంజ్ కారును తగలబెట్టాడు. ఆ కారు పదే పదే ట్రబుల్ ఇవ్వడంతో ఏకంగా కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. Motor.com తెలిపిన వివరాల ప్రకారం రష్యాకు చెందిన మిఖాయిల్ లిట్విన్ అనే యూట్యూబ్ బ్లాగర్ తన మెర్సిడెజ్ బెంజ్ కారును తగలబెట్టాడు. ఓ ఖాళీ పొలంలో తన కారును పెట్టి, దాని మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పదే పదే తన కారు ట్రబుల్ ఇవ్వడంతో ఇలా చేసినట్టు Motor.com తెలిపింది. అది మెర్సిడెజ్-AMG GT 63 S కారు ఖరీదు రూ.2.4 కోట్లు. ఆ కారు కొన్నప్పటి నుంచి పదే పదే ట్రబుల్ ఇస్తోంది. అతడు అధికారిక డీలర్ షిప్ నుంచి కారును కొనుగోలు చేశాడు. తన కారు పదే పదే బ్రేక్ డౌన్ అవుతుండడంతో రిపేర్‌కు పంపాడు. ఇప్పటికి ఐదుసార్లు రిపేర్ చేయించాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అతడి సమస్య అలాగే ఉంది. మొత్తానికి కొన్నప్పటి నుంచి సుమారు 40 రోజుల పాటు రిపేర్ కోసం గ్యారేజీలోనే ఉందా కారు. ఓ సారి ఏకంగా టర్బైన్ కూడా మార్చారు. ఏకంగా జర్మనీ నుంచి కొత్త టర్బైన్ తీసుకొచ్చి బిగించారని VC.ru. అనే స్థానిక వెబ్ సైట్ పేర్కొంది.

ఇన్ని సార్లు రిపేర్లు, కొత్తగా టర్బైన్ మార్చిన తర్వాత కూడా అతడి కారు మళ్లీ ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత అతడు కాల్ చేస్తే స్థానిక డీలర్ కూడా స్పందించడం మానేసినట్టు అతడు ఆరోపించాడు. దీంతో మిఖాయిల్‌కి విసుగెత్తుకొచ్చింది. ఫ్రస్ట్రేషన్‌లో ఏం చేయాలో ఆలోచించాడు. ఇక దీన్ని తగలబెట్టడం బెటర్ అని నిర్ణయానికి వచ్చాడు. తన నిరసన తెలిపేందుకు ఇదే సరైన మార్గం అని అతడు భావించాడు. ఈ క్రమంలో తన కారును తీసుకుని వెళ్లి ఓ ఖాళీ పొలంలో పార్క్ చేశాడు. దాని మీద పెట్రోలో పోశాడు. అనంతరం లైటర్‌తో నిప్పు అంటించాడు. ఈ తతంగం మొత్తం అతడు వీడియో తీసి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశాడు.

' isDesktop="true" id="646186" youtubeid="TVCWKa1mbkE" category="trending">

‘మెర్సిడెజ్‌తో విబేధాల తర్వాత చాలా రోజుల నుంచి ఈ ‘షార్క్‌’ని ఏం చేయాలని అనుకుంటున్నా. నా ఉద్దేశంలో దీనికి నిప్పు పెట్టడమే నయం అనిపించింది. కానీ నేను ఆనందంగా మాత్రం లేను.’ అంటూ కామెంట్ చేశాడు. ఈ షాకింగ్ వీడియో యూట్యూబ్‌లో 11 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. మిఖాయిల్‌కు 5 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ డేంజరస్ వీడియోను చూసి చాలా మంది కామెంట్లు చేశారు. అందులో కొందరు తిట్టారు. మరికొందరు వెరైటీ వెరైటీ కామెంట్లు చేశారు. ‘అరె అలా ఎలా తగలబెట్టావ్? ’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘అమెరికన్ బ్లాగర్స్ ఐ ఫోన్ పగలగొడతారు. రష్యా బ్లాగర్స్ మెర్సిడెజ్ కార్లు తగలబెడతారు.’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘పోనీలే. ఆ వ్యూస్ ద్వారా వచ్చిన ఆదాయంతో మరో రెండు కార్లు కొనుక్కోవచ్చు.’ అంటూ మరో కామెంట్ కూడా వచ్చింది.

First published:

Tags: Russia, Youtube

ఉత్తమ కథలు