Viral video: వామ్మో... ఆటో... షాక్ ఇచ్చిందిగా... వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్న నెటిజన్లు

Viral video: వామ్మో... ఆటో... షాక్ ఇచ్చిందిగా... వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్న నెటిజన్లు (image credit - twitter)

Viral video: కొన్ని వీడియోలు చూసినప్పుడు ఒకింత ఆనందం, ఒకింత భయం, ఒకింత టెన్షన్, ఒకింత థ్రిల్ కలుగుతాయి. అలాంటి వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నాం. దాని వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Viral video: మీరు హాలీవుడ్ సినిమాల్లో చూసే ఉంటారు. వేగంగా వస్తున్న వాహనం ప్రజలను ఢీకొట్టకముందే... సూపర్‌మేన్ వచ్చి అడ్డుకుంటాడు. తన చేతులతో వాహనాన్ని ఆపేస్తాడు. దాంతో ప్రజలు... జైజై సూపర్‌మేన్ అంటారు. అది సినిమాల్లో సాధ్యమే... బయట కష్టం. కానీ... బయట కూడా సాధ్యమే అని నిరూపించాడు ఓ వ్యక్తి. వేగంగా, వంకరగా వస్తున్న ఆటోను సెట్ చేసేశాడు. ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు కాపాడాడు. అసలీ వీడియోని చూసినవారు... మళ్లీ మళ్లీ చూడటానికి కారణం... ఆ ఆటో వచ్చిన విధానం, అతను అడ్డుకున్న విధానం... ఇదెలా సాధ్యమైంది అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వావ్... రియల్ సూపర్ హీరో అని మెచ్చుకుంటున్నారు.

    ఈ వీడియో అంతా కలిపి 8 సెకండ్లు ఉంది. దీన్ని డాక్టర్ అజతీయ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇండియాలో ఎవరైనా సూపర్ హీరో కాగలరు అని క్యాప్షన్ పెట్టారు. ఇందులో ఓ వ్యక్తి రోడ్డుపక్కన నిల్చొని ఉన్నారు. అసలే ఆ రోడ్డు చాలా చిన్నగా ఉంది. అక్కడే ఓ మలుపు ఉంది. అలాంటి రోడ్డుపై మలుపు దగ్గర నెమ్మదిగా రావాలి. అలాంటిది ఓ ఆటో వేగంగా వచ్చింది. టర్న్ తిరిగేటప్పుడు పక్కకు వంగింది. అది తిన్నగా ఆ నిలుచున్న వ్యక్తిపై పడబోయింది. అలా ఆటో బోల్తా కొట్టబోతున్న సమయంలో... ఆ వ్యక్తి అడ్డుకున్నారు. ఆటోను తిరిగి సరైన స్థితిలోకి నెట్టేశారు. దాంతో... తనను తాను కాపాడుకోవడమే కాకుండా... ఆటోలో ప్రయాణికుల్ని కూడా కాపాడినట్లైంది. ఆ వీడియోని మీరే ఇక్కడ చూడండి.


    ఈ వీడియోకి సంబంధించి మరిన్ని వివరాలు లేవు. సీసీటీవీ ఫుటేజ్‌లో ప్రమాద దృశ్యం రికార్డ్ అయ్యింది. ఐతే... ప్రమాదం జరగకుండా ఆపినందుకు ఆటో డ్రైవర్ ఆటోను ఆపి అతనికి థాంక్స్ చెప్పాడా లేక... ఆటోను ఆపకుండా వెళ్లిపోయాడా అన్నది తెలియలేదు.


    ఈ వీడియోను ట్విట్టర్‌లో జూన్ 17న పోస్ట్ చేశారు. ఇప్పటికే దీన్ని 2 లక్షల మందికిపైగా చూశారు. 21వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అందరూ ఆ కాపాడిన వ్యక్తిని మెచ్చుకుంటున్నారు. అంత తక్కువ సమయంలో ఆయన బాగా స్పందించారని పొగుడుతున్నారు.

    ఇది కూడా చదవండి: Viral video: 10 అంతస్తుల భవనం... ఒక్క రోజులో నిర్మాణం... ఎలా?

    అతను సూపర్ హీరో మాత్రమే కాదు... ఇంటెలిజెంట్ కూడా... ఎందుకంటే... తనను తాను కాపాడుకుంటూ... ఇతరుల్నీ కాపాడాడు అని మెచ్చుకోగా... కొందరు మాత్రం... ఇండియాలో ఇలాంటివి కామనే అంటూ తేలిగ్గా తీసిపారేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: