• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO YOU WILL MISS SOMETHING IF YOU NOT WATCHING THIS VIDEO OF COPS DANCING FOR SAPNA CHOUDHARYS SONG NK

Viral Video: సప్నా చౌదరి పాటకు చిందేసిన ఎస్పీ, ఇన్‌స్పెక్టర్... రెస్పాన్స్ అదుర్స్

Viral Video: సప్నా చౌదరి పాటకు చిందేసిన ఎస్పీ, ఇన్‌స్పెక్టర్... రెస్పాన్స్ అదుర్స్

సప్నా చౌదరి పాటకు చిందేసిన ఎస్పీ, ఇన్‌స్పెక్టర్ (image credit - twitter)

Viral Video: డాన్స్ కూడా తరాలకు తగ్గట్టుగా మారుతుంది. ఒక్కో తరంలో ఒక్కో రకమైన స్టెప్స్ ఉంటాయి. మరి ఎస్సీ, ఇన్‌స్పెక్టర్ ఎలాంటి స్టెప్స్ వేశారో చూద్దాం.

  • Share this:
    Viral Video: సోషల్ మీడియా ఈ రోజుల్లో ప్రజలకు చేరువయ్యే మంచి మీడియాగా మారింది. ముఖ్యంగా నెటిజన్లు మంచి విషయాల్ని నలుగురికీ చేరవేస్తూ... వైరల్ చేస్తున్నారు. చాలా వీడియోలు మనలో ఎమోషన్స్‌కి తట్టి లేపుతాయి. కొన్ని మనలో ఉత్సాహాన్ని పెంచుతాయి. కొన్ని నవ్విస్తాయి... కొన్ని ఏడిపిస్తాయి... అలాంటి వాటిలో మరొకటి చేరింది. IPS ఆఫీసర్లు ఆర్కే విజ్, దీపాన్షు కబ్రా వేసిన డాన్స్ ఇప్పుడు వైరల్ అయ్యింది. హర్యానా డాన్సర్ సప్నా చౌదరి సాంగ్ "గజ్బాన్ పానీ లే చాలీ"కి వారు తమదైన శైలిలో స్టెప్స్ వేశారు.

    ఎస్పీ, ఇన్‌స్పెక్టర్ కలిసి... డీజే ఫ్లోర్‌పై అలా స్టెప్స్ వేయడం నెటిజన్లకు బాగా నచ్చుతోంది. సినిమాల్లోలా కాకుండా... వారు వేసిన స్టెప్స్ డిఫరెంట్‌గా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.


    ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్‌తోపాటూ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీన్ని ట్విట్టర్‌లో లక్షా 78వేల మంది చూశారు. 3వేలకు పైగా లైక్స్ వచ్చాయి. కూల్ కామెంట్స్ వస్తున్నాయి. డ్యూటీ తర్వాత కాప్స్ ఇలా ఎంజాయ్ చేయడం నెటిజన్లకు నచ్చుతోంది.


    ఆసమ్ డాన్స్... ఎపిక్ మూవ్స్ అని ఓ నెటిజన్ మెచ్చుకోగా... యూనిఫామ్ లేనప్పుడు వారు కూడా సామాన్యులే... వారు కూడా తమ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. ఎక్ దమ్ మస్త్ అని మరో యూజర్ కామెంట్ చేశారు.




    2019లో సప్నా చౌదరి పాట "తేరీ ఆఖ్యా కా యో కాజల్‌"కి ఢిల్లీలో మహిళా పోలీసులు డాన్స్ చేశారు. అప్పట్లో ఆ వీడియోను కూడా నెటిజన్లు వైరల్ చేశారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు