హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

లోకల్ ట్రైన్ లో మహిళల గర్భా ప్రదర్శన.. వైరల్ గా మారిన వీడియో..

లోకల్ ట్రైన్ లో మహిళల గర్భా ప్రదర్శన.. వైరల్ గా మారిన వీడియో..

లోకల్ ట్రైన్ లో మహిళల గార్బా నృత్యం

లోకల్ ట్రైన్ లో మహిళల గార్బా నృత్యం

Viral Video: మహిళలు ఉదయాన్నే ఆఫీసులో వెళ్లడానికి రెడీ అయి లోకల్ ట్రైన్ ఎక్కారు. ఒక్కసారిగా అక్కడున్న వారంతా గ్రూప్ గా ఏర్పడి గార్భ డ్యాన్స్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

దేశ మంతాట దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో కొలుస్తుంటారు. కొన్ని చోట్ల పూజల తర్వాత సాయంత్రం మహిళలు ప్రత్యేకంగా దాండియా, గర్బా డ్యాన్స్ చేస్తుంటారు. ఆయా ప్రదేశాల్లో మహిళలు, పురుషులు అని తేడా లేకుండా.. అందరు కలిసి ఒక సర్కిల్ మాదిరిగా ఏర్పడి గార్భా ప్రదర్శన చేస్తుంటారు. ఈ క్రమంలో మెట్రోలో మహిళలు చేసిన గార్భా ప్రదర్శన సోషల్ మీడియాలో (Socia media)  వైరల్ గా (Viral video) మారింది.

పూర్తి వివరాలు.. దేశ మంతాట దుర్గాపూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు వివిధ రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. కొందరు తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు కూడా ఉంటారు. అయితే.. అనేక చోట్ల దాండియా డ్యాన్స్, గర్భా ప్రదర్శన చేస్తుంటారు. వీటిల్లో పోటీ కూడా ఉంటుంది. ఎవరైతే గర్భాడ్యాన్స్ బాగా చేస్తారో వారికి ప్రత్యేకంగా బహుమతిని కూడా ఇస్తారు.

అయితే.. ముంబైలోకి (mumbai) లోకల్ ట్రైన్ లో (local trin)  కొందరు మహిళలు ట్రైన్ లోనే ఒక సమూహంగా ఏర్పాడ్డారు. అందరు కలిసి గర్బా డ్యాన్స్ చేశారు. లోకల్ ట్రైన్ లో కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే యువతులు, మహిళలు అంత గుంపులుగా ఏర్పడి గార్భ ప్రదర్శన చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యనే కొందరు వినూత్నంగా రాజస్థాన్ లో స్విమ్మింగ్ పూల్ లో గుంపులుగా గర్భా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా గుజరాత్ లోని (Gujarat)  గర్భా నృత్యం ఫెమస్ అనే విషయం మనకు తెలిసిందే.

అయితే... అక్కడ అహ్మదాబాద్ లోని పాతబస్తీలో పురుషులు నవరాత్రి వేడుకలు రాగానే చీరలు కట్టుకుని మరీ గర్భాడ్యాన్స్ చేస్తారు. అయితే.. అక్కడ నవరాత్రి వేడుకలలో ఎనిమిదవ రోజున బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ 200 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీనివెనుక ఒక పురాణ గాథ ఉంది. కాగా, సదుబా అనే మహిళ తన బిడ్డను, ఎవరో పురుషుడి వలన పొగొట్టుకుంది. దీంతో ఆమె పురుషులకు శాపం పెట్టింది. దీంతో అక్కడి వారు.. సదుబా చనిపోయాక ఆమెకు గుడికట్టించారు.

అంతే కాకుండా... ఆలయాన్ని సందర్శించే పురుషులు తప్పినసరిగా చీరలు ధరించి వెళ్లాలి. అక్కడు పురుషులు వెళ్లి ప్రార్థన చేసి, ఆమెకు క్షమాపణ కోరతారు. ఈ సంప్రదాయం 200 ఏళ్ల నాటిదని నమ్ముతారు 200 సంవత్సరాల క్రితం తమను శపించిన సదుబా నుండి పురుషులు క్షమాపణ కోరతారు. అష్టమి రోజున, నగరం నలుమూలల నుండి వందలాది మంది బారోట్ కమ్యూనిటీకి చెందిన వారు సాదు మాతా ని పోల్ వద్ద సదు మాతకు తమ నమస్కారాలు చెల్లించడానికి సమావేశమవుతారు. అక్కడ చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఈ ఘటన వార్తలలో నిలిచింది. నవదుర్గ ఆరాధనకు అంకితం చేయబడిన నవరాత్రులు సెప్టెంబర్ 26న ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తాయి. నవరాత్రులు మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Dussehra 2022, Metro Train, Mumbai

ఉత్తమ కథలు