హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: వామ్మో.. ఇదేందిరా నాయన.. కాలును అమాంతం పైకెత్తి ఇలా చేసింది.. వైరల్ అవుతున్న వీడియో..

OMG: వామ్మో.. ఇదేందిరా నాయన.. కాలును అమాంతం పైకెత్తి ఇలా చేసింది.. వైరల్ అవుతున్న వీడియో..

కాలుతో క్యాబిన్ డోర్ మూస్తున్న మహిళ

కాలుతో క్యాబిన్ డోర్ మూస్తున్న మహిళ

Viral video: మహిళ విమానంలో  ప్రయాణిస్తుంది. ఆమె దిగాల్సిన ప్రదేశం వచ్చింది. విమాన క్యాబిన్ నుంచి తన లగేజీ తీసుకుంది. ఒక చేతిలో లగేజీ, మరో చేతిలో చంటి బిడ్డను ఎత్తుకుంది.

సాధారణంగా మనలో చాలా మంది బస్సుల్లో, ట్రైన్స్, విమానా లలో (Journeys) ప్రయాణిస్తుంటారు. కొందరు కూర్చున్న చోటే తిన్నపదార్థాలు, కవర్ లు పడేస్తుంటారు. మరికొందరు కిటికిలు, డోర్ లను ఇష్టమోచ్చినట్లు తెరిచిపెడతారు. కనీసం డీసెన్సీని పాటించరు. ఈ క్రమంలో కొందరు దీనికి భిన్నంగా ఉంటారు. తాము కూర్చున్న స్థలంలో పరిశుభ్రతను పాటిస్తుంటారు. తాము.. ఎంత బిజీగా ఉన్న పద్ధతిగా నడుచు కుంటారు. గమ్య స్థానం రాగానే అక్కడే ఉన్న ఏదైన చెత్త ఉంటే వాటిని తీసేస్తారు. కిటీకిలు, డోర్ లు మూసేస్తూ డీసెంట్ గా ప్రవర్తిస్తారు.

ప్రస్తుతం ఒక మహిళ.. విమానంలో క్యాబిన్ డోర్  (Flight) తీసి తన లగేజీ తీసుకుంది. ఆ తర్వాత.. ఆమె చేసిన పనిని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతి రోజు వేల వీడియోలు వైరల్ (Viral video) అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని స్ఫూర్తి వంతంగా ఉంటాయి. నెటిజన్లు వీటిని చూడటానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు.


పూర్తి వివరాలు.. ఒక మహిళ విమానంలో (Flight)  ప్రయాణిస్తుంది. ఇంతలో ఆమె దిగాల్సిన గమ్యం వచ్చేసింది. ఈ క్రమంలో ఆమె ఒక చేతిలో చంటి పిల్లాడిని ఎత్తుకుంది. మరోక చేతితో విమాన క్యాబిన్ నుంచి (Cabin door)  తన లగేజీని (Luggage)  బైటకు తీసింది. ఇక క్యాబిన్ డోర్ ను మూసేయాలను కుంది. కానీ తన చేతులు ఖాళీగా లేదు. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ఆ మహిళ తన కాలునే అమాంతం పైకి ఎత్తింది. తన కాలుతో క్యాబిన్ డోర్ ను క్లోజ్ చేసింది. ఆమె కాలును పైకెత్తగానే అక్కడున్న ప్రయాణికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఒకరిద్దరు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఆమె అంతలోనే తన కాలును పైకెత్తి తన పని కానిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను "OMG So Cool" అనే క్యాప్షన్‌తో  ఫిగెన్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట  వైరల్ గా  (video viral) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కాళ్లలో ఏమైన స్ప్రింగ్ లు ఉన్నాయా.. అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.

First published:

Tags: Flight, Viral Video

ఉత్తమ కథలు