VIRAL VIDEO WOMAN OFFERS WATER TO THIRSTY SQUIRREL KINDNESS MELTS PEOPLE S HEARTS PAH
Viral video: నిజంగా ఎంత గొప్ప మనసమ్మా నీది... వైరల్ అవుతున్న వీడియో..
ఉడతకు నీళ్లు తాగిస్తున్న యువతి
Trending video: అమ్మాయి రోడ్డుపక్కన వెళ్తుంది. ఇంతలో చెట్టు పక్కన వచ్చి నిలబడింది. తన బాటిలో నీళ్లను తీసుకుని తాగుతుంది. అయితే, చెట్టుకింద ఒక ఉడత అక్కడ ఉన్న నీటి చుక్కలను నాకుతుంది. దీన్ని అమ్మాయి గమనించింది.
కొందరు మూగ జీవాల పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు. మనుషులకన్న నోరులేని జీవాలే విశ్వాసంతో ఉంటాయని భావిస్తారు. అందుకే చాలా మంది తమ ఇళ్లలో కుక్కలు, పిల్లులను పెంచుకుంటారు. ఇక ఎవరైన.. సింగిల్ గా ఉంటే వారు కూడా మూగజీవాలను పెంచుకొవడానికి ఆసక్తి చూపిస్తారు. మరికొందరు రోడ్డుపైన ఉండే మూగ జీవులకు తమకు తోచిన ఆహరం పెడుతుంటారు.
ఒక వేళ వాటికి ఏమైన వెంటనే స్పందిస్తుంటారు. మెయిన్ గా ఎండా కాలంలో మూగజీవాలు ఆహారం , నీటి కోసం విలవిల్లాడిపోతుంటాయి. ఎక్కడైన నీరు దొరుకుందేమోనని వెతుకుతుంటాయి. ఇప్పటికే కొందరు మూగు జీవాల దాహార్తిని తీర్చిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. అయితే, ఒక అమ్మాయి రోడ్డు పక్కనే మూగ జీవి దాహర్తిని తీరుస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట (Social media) హల్ చల్ చేస్తుంది.
పూర్తి వివరాలు.. రోడ్డుపక్కన ఒక ఉడతను అమ్మాయి చూసింది. అది నీళ్ల కోసం అక్కడ వెతుకుతుంది. కింద పడిన కొద్దిగా ఉన్న నీళ్లను తన నాలుకతో నాకుతుంది. దీన్ని అమ్మాయి గమనించింది. వెంటనే తన చేతిలోని బాటిల్ ను ఉడత ముందు పెట్టింది. ఉడత కూడా ఏమాత్రం భయపడకుండా బాటిల్ లోని నీళ్లలను గట గట తాగేసింది. అమ్మాయి కూడా ఉడత నీళ్లు తాగే వరకు ఒపిగ్గా అక్కడే బాటిల్ పట్టుకుని నిలబడింది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియోను బ్యూటెంగెబిడెన్ అనే ఖాతా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో (viral video) నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్(Madhya pradesh)లోని ఇండోర్లో ఓ భర్త చేసిన పని తెలిసి భార్య ఆశ్చర్యపోయింది.
ఛోటా బంగార్డా ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం బబిత అనే మహిళతో వివాహమైంది. 15 రోజుల క్రితం తండ్రి కూడా అయ్యాడు. అయితే భార్యను ప్రసవం కోసం ఆమె పుట్టింటికి పంపించిన భర్త తర్వాత ఖజ్రానా ప్రాంతానికి చెందిన మరో అమ్మాయితో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్యకు ఫేస్బుక్ ద్వారా తెలిసింది. దీంతో భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బబిత. భర్త చాలా కాలంగా ముస్లిం అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య బబిత ఆరోపిస్తోంది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. భర్త మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని భార్య చెప్పింది. అంతే కాదు భర్త ఫోన్లో కూడా తనను బెదిరించాడని తెలిపింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.