Woman Lies on Railway Tracks as Train Runs Over Her: సాధారణంగా కొందరు ఆత్మహత్య చేసుకొవడానికి రైళ్ల పట్టాల మీద పడుకుంటుంటారు. మరికొందరు ప్లాట్ ఫామ్ మీద నిలబడి రైలు కోసం వేచిచూస్తారు. రైలు రాగానే.. దాని ముందుకు అమాంతం జంప్ చేసేస్తుంటారు. ఇలాంటి చాలా సందర్భాలలో చాలా మంది రైలు కిందపడి చనిపోతారు. కానీ కొందరు మాత్రం.. వెంట్రుక వాసిలో ప్రాణాల నుంచి బయటపడతారు.
ప్రేమలో విఫలమయ్యామని, పరీకలలో ఫెయిల్ అయ్యామని, ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఇలా రకరకాల కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి. తాజాగా, ఒక యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
फ़ोन पर gossip, ज़्यादा ज़रूरी है 🤦🏻♂️ pic.twitter.com/H4ejmzyVak
— Dipanshu Kabra (@ipskabra) April 12, 2022
పూర్తి వివరాలు.. ఒక ఎరుపు రంగు చుడీదార్, బ్లూకలర్ స్కార్ఫ్ వేసుకున్న ఒక యువతి రైలు పట్టాల మీద పడుకుంది. రైలు కోసం ఎదురుచూస్తుంది. ఇంతలో.. గూడ్స్ రైలు వేగంగా వచ్చింది. ఆమె అక్కడే పట్టాల మీద పడుకుంది. రైలు వేగంగా వచ్చి ఆమెపై నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. ఆమె అసలు.. ఏమి జరగనట్లు ఫోన్ లో మాట్లాడుకుంటూ.. లేస్తుంది. పట్టాల మీది నుంచి లేచి పక్కలు నడుచుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లో గతంలో ఒక వ్యక్తిపై ., కొందరు కాల్పులకు తెగబడ్డారు.
Liquor Sales Manager Shot DeadH:ఉత్తర ప్రదేశ్ లోని బైజల్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. బస్తీ జిల్లాలో మద్యం సేల్స్ మేనేజర్ పై గుర్తుతెలియని దుండగులు పట్టపగలు కాల్పులకు పాల్పడ్డారు. బైజల్ పూర్ గ్రామంలో కడ్సరా ఎస్ చక్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుడు బలరాంపూర్ జిల్లాకు చెందిన వినయ్ సింగ్ గా గుర్తించారు.
సంఘటన జరిగినప్పులు వినయ్ సింగ్ కద్సరాలోని అతని.. అత్తమామల ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వినయ్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. వినయ్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీ కెమారాలను పరిశీలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.