• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO WOMAN CALLS BOYFRIEND AS SOON AS HUSBAND GOES TO WORK FROM HOME THEN HIDDEN CAMERA EXPLODES WHAT HAPPENS NK

Viral real video: ప్రియుడితో భార్య బిజీ... అంతలో వచ్చిన భర్త... ఆ తర్వాత హైడ్రామా

Viral real video: ప్రియుడితో భార్య బిజీ... అంతలో వచ్చిన భర్త... ఆ తర్వాత హైడ్రామా

ప్రియుడితో భార్య బిజీ... అంతలో వచ్చిన భర్త... ఆ తర్వాత హైడ్రామా (image credit - twitter)

Viral real video: భర్త ఎప్పుడు వెళ్లిపోతాడా అని ఎదురుచూసిన ఆమె... అతను వెళ్లగానే ప్రియుణ్ని పిలిపించుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

  • Share this:
    Viral real video: సోషల్ మీడియా సాక్షిగా ఓ వివాహేతర సంబంధం గుట్టు రట్టైంది. ఓ వివాహిత... భర్తను ఎలా మోసం చేస్తోందో బయటపడింది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అతనికి ముద్దులు ఇచ్చి మరీ బయటకు పంపుతోంది. తీరా అతను వెళ్లాక... ప్రియుడికి కాల్ చేస్తోంది. "బయటకు పోయాడు. వచ్చేయ్" అంటోంది. ఆమె ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రియుడు... ఆ కాల్ రావడమే ఆలస్యం... వెంటనే ఇంట్లో ప్రత్యక్షమవుతున్నాడు. ఆ తర్వాత సరససల్లాపాల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి యవ్వారాలు ఎన్నాళ్లని సాగుతాయి. ఏదో ఒక రోజు బయటపడి తీరుతుంది కదా. ఆ రోజు వచ్చేసింది. అప్పుడు ఏమైందో తెలుసుకుందాం.

    ఎప్పట్లాగే భర్త బయటకు వెళ్లాడు. ప్రియుడు వచ్చాడు. అతనితో ఆమె బిజీ అయ్యింది. ఇంతలో టక్ టక్ టక్ మని డోర్ సౌండ్ వచ్చింది. ఎవరో వచ్చారు అని ఇద్దరూ అనుకున్నారు. ప్రియుడు ఓ టేబుల్ పక్కన దాక్కున్నాడు. ఆమె అమాయక ఫేస్ పెట్టి డోర్ తీసింది. చూస్తే ఎదురుగా భర్త. వెంటనే ఆమె ఫేస్‌లో భయం. పైకి మాత్రం నటిస్తూ... "వావ్... ఏంటివాళ త్వరగా వచ్చేశారు" అంటూ మాటల్లో పెట్టింది. ముద్దులతో ముంచెత్తింది. అతన్ని వేరే గదిలోకి లాక్కుపోయింది. ఇటు ప్రియుడికి ఒకటే టెన్షన్. ఊపిరి బిగపట్టుకొని కిచెన్‌లో మూల దాక్కున్నాడు. ఆమె భర్త... ప్రియుడు ఉన్న కిచెన్ వైపు వెళ్లబోతుంటే... ఆమె మధ్యలోనే అడ్డుకొని... ముద్దులతో అతన్ని రెచ్చగొట్టింది. ఆమె ప్లాన్ తెలియని అతను... తనపై ఎంతో ప్రేమ చూపిస్తోందని అనుకున్నాడు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. మీరూ చూడండి.




    ఈ వీడియోని ఎక్కడ రికార్డ్ చేశారో కూడా తెలియలేదు. చీటింగ్ వైఫ్... దొరికిపోయింది అని మాత్రం క్యాప్షన్‌లో ఉంది. ఆమెపై డౌట్ ఉండబట్టే భర్తే ఈ వీడియోని సీక్రెట్‌గా సెట్ చేసి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే నిజమై ఉంటే... అతను ఆ వీడియోని చూసే ఉంటాడు. ఇదంతా తెలిసే ఉంటుంది. ఆ తర్వాత అతను విడాకులు ఇచ్చాడా, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడా... ఇవన్నీ సస్పెన్సే.

    ఇది కూడా చదవండి: Covid: ఓమైగాడ్... ఒక్కరి వల్ల 406 మందికి కరోనా వ్యాప్తి?... ఇలాగైతే కష్టమే...

    వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. మాయలాడి, కిలాడీ, కిలేడీ, మోసగత్తె, మాయలేడీ, దొంగది, చీటింగ్ వైఫ్ అని రకరకాలుగా కామెంట్లు రాస్తున్నారు. మరి నిజంగానే ఆమె అలాంటిదా లేక... ఆమెతో భర్త సరిగా వ్యవహరించకపోవడం వల్లే ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందా అనేది మనకు తెలియని విషయం.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు