కిచెన్ లో ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అత్యంత భయానక సంఘటనలు జరుగుతాయి. ఇప్పటికే కిచెన్ లో గ్యాస్ లీకై అనేక ప్రమాదాలు జరిగిన ఘటనలు వార్తలలో ఉన్నాయి. కొన్ని సార్లు.. వంట చేస్తుండనే బట్టలకు మంటలు అంటుకున్న ఘటనలు మనం చూశాం. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. కుక్ కెల్లికారన్ అనే మహిళ లైవ్ లో తన స్పెషల్ పదార్థాలను వండటం పై లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది. ప్యాన్ లో ఆయిల్ తీసుకుంది. గ్యాస్ మీద పెట్టింది. అప్పుడు ఊహించని ఘటన జరిగింది. వెంటనే ప్యాన్ లోని మాంసానికి మంటలు అంటుకున్నాయి.
ఆమె అప్రమత్తమై వెంటనే ప్యాన్ ను పక్కకు తీసుకెళ్లి పెట్టింది. అప్పటికే మంటలు పొగల కిచెన్ అంతా వ్యాపించాయి. ఎంత ఆర్పడానికి ప్రయత్నించిన మంటలు అదుపులోనికి రాలేదు. వెంటనే మహిళ ప్యాన్ ను అక్కడే వదిలేసి సహాయం కోసం బైటకు పరుగులు తీసింది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఒక వ్యక్తి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తించాడు.
మహిళ అని కూడా చూడకుండా చెంపదెబ్బలు కొడుతూ.. కాలితో తన్నుకుంటూ, ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేశాడు.ఈ ఘటన కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (Karnataka) బాగల్ కోట్ జిల్లాల వినాయక్ నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. మహేంతేష్ అనే వ్యక్తి, తన సంగీత అనే మహిళ లాయర్ (Lawyer attack) మీద నడిరోడ్డుమీద దాడిచేశాడు. ఆమెను చెంపల మీద కొడుతూ.. కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె వద్దని వారిస్తున్న, ఆపడానికి ప్రయత్నిస్తున్న ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు. మహిళ.. స్టూల్ తో అతడిని ఆపడానికి ప్రయత్నించిన అది సాధ్యపడలేదు.
అతగాడి పశుబలం ముందు మహిళ, అచేతనంగా మారింది. అక్కడున్న వారు ఎవరు అతగాడిని ఆపే సాహసం మాత్రం చేయడం లేదు. కాగా, లాయర్ సంగీత, మహంతేష్ ను సివిల్ కేసులో ఇబ్బందులకు గురిచేసిందని అతను కోపం పెంచుకున్నాడు. అదను కోసం ఎదురు చూసి దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.