Home /News /trending /

VIRAL VIDEO WILD BUFFALO ATTACKS VEHICLES IN KERALA FLIPS AUTO RICKSHAW IN RAGE PAH

షాకింగ్.. కొమ్ములతో ఆటోను లేపీ పడేసిన దున్నపోతు.. వీడియో వైరల్..

ఆటోపై దాడి చేస్తున్న దున్నపోతు

ఆటోపై దాడి చేస్తున్న దున్నపోతు

Kerala:  రాత్రిపూట ప్రయాణికులు కార్లు, ఆటోలలో అటవీ మార్గం గుండా వెళ్తున్నారు. ఈక్రమంలో.. అక్కడ ఒక దున్న పోతు రోడ్డుమీదకు వచ్చింది. ఇంతలో అది ఆటోవైపుకు కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India
కొన్నిసార్లు జంతువులు దారితప్పి రోడ్ల మీదకు వస్తుంటాయి. ఈ క్రమంలో అవి రోడ్లపైన వాహానాలను చూసి బెదిరిపోతుంటాయి. మెయిన్ గా రాత్రిపూట ఎక్కువగా పులులు, చిరుతలు, ఏనుగులు, సింహాల వంటి జంతువులు రోడ్డుదాటడం మనం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాలలో అవి వాహానాలపైకి దాడికి దిగుతుంటాయి. కొన్నిసార్లు..మనుషులపైన దాడులు చేసి చంపేస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది. పూర్తి వివరాలు.. కేరళలో (Kerala) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అడవికి దగ్గరగా ఉన్న రూట్ లో రాత్రిపట ఆటోలు, కార్లు వెళ్తున్నాయి. ఇంతలో ఒక అడవిదున్న సడెన్ గారోడ్డు మీదకు వచ్చింది. ఏమైందో ఏమో కానీ.. కోపంగా పరిగెత్తుకుంటు ఆటోవైపుకు వచ్చింది. ఈ క్రమంలో బాహుబలి రేంజ్ లో ఆటోపై దాడిచేసింది. ఆటోను తన కొమ్ములతో లేపి అవతలవైపుకు పడేసింది.ఈ కుదుపుకు ఆటో గాల్లో ఎగిరి మరల కిందకు పడింది. అయితే.. దాని కోపం ఇంకా చల్లారలేదో ఏంటో కానీ.. మళ్లి వెనక్కుతిరిగి వచ్చింది.
ఆటోవైపుకు వచ్చింది. కానీ అప్పటికే ఆటో అతను చాకచక్యంగా వ్యవహరించి, అక్కడి నుంచి వేగంగా ఆటోను పొనిచ్చాడు. ఆటో వెనుకాల ఉన్న వారు.. ఈ ఘటనను వీడియో తీస్తున్నారు. దానిలో దున్నపోతు దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది. ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హత్రాస్ లో కోతులు బాలికపై దాడికి పాల్పడ్డాయి. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. మరో ఇంటిలోపలికి వెళ్లి దాక్కుంది. కూతురి అరుపులు విని తండ్రి బయటకు వచ్చాడు. అప్పటికే పదుల సంఖ్యలో కోతులు గట్టిగట్టిగా అరుస్తు అతడిని చుట్టుముట్టాయి. అతను కూడా ఏమాత్రం భయపడకుండా కోతుల గుంపులను ఎదుర్కొన్నాడు. వాటిపైన కొట్టడానికి వెళ్లాడు. అక్కడ నుంచి కోతులను తరిమేశాడు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక గండుకోతి అతనిపై దూకి, కిందపడేసింది. దీంతో అతను కింద పడిపోయాడు. వెంటనే తిరిగిలేచి మరల కోతిని అక్కడినుంచి తరిమేశాడు. కాసేపటికి కోతులన్నిఅక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ వీడియో (video viral) ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) తెగ చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఎంత భయంకరంగా దాడిచేస్తుంది..., నిజంగా బాలిక తండ్రికి మెచ్చుకొవాల్సిందే.. అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Kerala, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు