Home /News /trending /

VIRAL VIDEO WHEN YAMRAJ THINKS OTHERWISE AND LETS YOU LIVE WATCH THE VIDEO AND YOU WILL UNDERSTAND PAH

‘యముడు లంచ్ బ్రేక్ లో ఉన్నాడేమో..’.. రెప్పపాటులో షాకింగ్ ఘటన.. వైరల్ గా మారిన వీడియో..

కుంగిపోయిన నాలా

కుంగిపోయిన నాలా

Viral video: ఒక వ్యక్తి నడుచుకుంటూ రోడ్డు మీద నుంచి వెళ్తున్నాడు. అతను నాలాను దాటుకుంటూ మరో పక్కకు వెళ్లాడు. ఇంతలో ఊహించని ఘటన జరిగింది.

మనం రోడ్డుమీద వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు కళ్లముందే ప్రాణాలు కోల్పోతే.. మరికొన్ని సార్లు.. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడిన అనేక సంఘటనలు జరిగాయి. కొంత మంది తరచుగా ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు దాటుతుంటారు. అడ్డదిడ్డంగా వాహనాలను నడిపిస్తుంటారు. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి.

కొన్నిసార్లు వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయట పడిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. రైలు పట్టాలపై వెళ్లేటప్పుడు.. పొరపాటున కాలు కింద పడుతుంటారు. అప్పుడు లక్ బాగుండి.. అనేక మంది ప్రాణాలతో బయటపడిన సంఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.





పూర్తి వివరాలు.. ఒక వ్యక్తి నడుచుకుంటూ రోడ్డుదాటుతున్నాడు. ఇంతలో.. అతను ఎడమ దిక్కుషాపుల వైపుకు వచ్చాడు. అక్కడ చిన్న నాలా ఉంది. దాని మీద స్లాబ్ ఉంది. అది దాటుకుంటూ ముందు వైపుకు నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. నాలా మీద ఉన్న స్లాబ్ ఒక్కసారిగా విరిగి కింద పడింది. అతను ఇలా దాని మీద నుంచి వెళ్లాడో లేదో.. సెకన్ల వ్యవధిలోనే నాలా ఒక్కసారిగా ఒక్కసారిగా కుంగి కిందపడిపోయింది. భయపడిపోయిన ఆ వ్యక్తి వెనక చూసి.. వామ్మో.. ఎంత ప్రమాదం తప్పిపోయిందంటూ అలా చూస్తునే ఉండిపోయాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది. యముడు లంచ్ బ్రేక్ కు ఉన్నాడేమో.. అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ట్రాఫిక్ పోలీసు రోడ్డుమీద రెచ్చిపోయాడు.

పూర్తి వివరాలు.. హర్యానాలో (Haryana)  ఒక ట్రాఫిక్ పోలీసు (Traffic police) నడిరోడ్డుమీద కంట్రోల్ తప్పాడు. ఫరీదాబాద్ లోని బాటా చౌక్ సమీపంలో.. టూవీలర్ మీద ముగ్గురు యువకులు డ్రైవింగ్ చేసుకుంటూ రాంగ్ రూట్ లో రోడ్డు మీదకు వచ్చారు. వీరిని అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే కోపంతో.. అక్కడ ఉన్న ఒక గొడ్డలి తీసుకున్నాడు. నరుకుతా.. అంటూ వారి మీదకు వెళ్లాడు.

అంతటితో ఆగకుండా.. కాలితో తంతూ ఇష్టమోచ్చినట్లు ప్రవర్తించాడు. ట్రాఫిక్ పోలీసును చూసి అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. మరో ప్రయాణికుడు తన మోబైల్ లో ఈ ఘటన రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త గా మారింది. ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Social Media, Viral Video

తదుపరి వార్తలు