హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

బెంగాల్ టీచర్ కు అరుదైన వీడ్కోలు .. వీడియో చూస్తుంటే కంట కన్నీళ్లు ఆగవు..

బెంగాల్ టీచర్ కు అరుదైన వీడ్కోలు .. వీడియో చూస్తుంటే కంట కన్నీళ్లు ఆగవు..

టీచర్ కు విద్యార్థుల వీడ్కోలు

టీచర్ కు విద్యార్థుల వీడ్కోలు

మనకు చిన్నప్పటి నుంచి ఎందరో ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుంటారు. అయితే, కొందరు టీచర్లతో మనకు చెప్పలేని గౌరవం, ప్రేమ,అభిమానం ఏర్పడతాయి. వారు తరగతిలోని పాఠాలను మాత్రమే కాకుండా.. జీవిత పాఠాలను కూడా బోధిస్తుంటారు.

మనకు చిన్నప్పటి నుంచి ఎందరో టీచర్లు (Teachers) తరగతులను బోధించారు. వారంతా.. తమ విద్యార్థులకు సరైన విద్య, క్రమశిక్షణలను నేర్పిస్తుంటారు. ఉపాధ్యాయుని అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే. తన విద్యార్థి చదువులలో, అన్నిరంగాలలో ముందుండాలని కోరుకుంటారు. అయితే, విద్యార్థులు కూడా తమ గురువు పట్ల ఎంతో గౌరవ, మర్యాదలను కల్గి ఉంటారు. దాదాపు అందరు టీచర్లు తమ స్టూడెంట్స్​ని.. తీర్చిదిద్దాటానికి తమ వంతుగా పాటుపడుతూ ఉంటారు. దీని కోసం ఒక్కొ టీచర్ ఒక్కొ పద్ధతిని పాటిస్తారు. అయితే, ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులకు తమ గురువుపట్ల ఒక ప్రత్యేక మైన గౌరవం, అనుబంధం( Students Emotional) ఏర్పడుతుంది.

అలాంటి తమ ప్రియమైన టీచర్ ఒక్కొసారి ప్రమోషన్లు లేదా ట్రాన్స్​ఫర్​లో భాగంగా వేరే చోటికి వెళ్లినప్పుడు విద్యార్థులు కొంత భావోద్వేగానికి గురౌతారు. తమ గురువుకు ఏదైన ప్రత్యేకంగా చేసి.. ఎప్పటికి గుర్తుండిపోయేలా ఫెర్​వల్​ను నిర్వహించాలని ( Teacher Gets Heart Warming Farewell )భావిస్తుంటారు. దీనికోసం వెరైన సర్​ప్రైస్​లను ప్లాన్​ చేస్తుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్​గా మారింది.

బెంగాల్ టీచర్ కు అరుదైన వీడ్కోలు

పూర్తి వివరాలు.. ప్రస్తుత సమాజంలో చాలా మంది విద్యార్థులు ఉపాధ్యాయులకు సరైన గౌరవం ఇవ్వడం లేదు. సినిమాల్లో చూసి... పాశ్చాత్య పోకడలకు పోయి టీచర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు. నేటి సినిమాలు కూడా.. క్లాస్​లలో ఉపాధ్యాయులను ఆటపట్టించడం మొదలైనవి చూపిస్తున్నారు. వీటిని చూసి కొందరు విద్యార్థులు పెడదోవపడుతున్నారు.

అయితే, గంజాయి వనంలో తులసీ మొక్కల మాదిరిగా అక్కడక్కడ కొంత మంది విద్యార్థులు తమ గురువుపట్ల ఎనలేని ప్రేమను, గౌరవాన్ని కల్గి ఉంటున్నారు. అలాంటి విద్యార్థులు తమ టీచర్​పట్ల చూపిన గౌరవం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పశ్చిమ బెంగాల్​ (West Bengal) లోని 24 పరగణా ప్రాంతంలో కటియా హట్ బికేఏపీ బాలికల పాఠశాల ఉంది.

అక్కడి విద్యార్థులకు తమ టీచర్​ సంపా అంటే ఎంతో గౌరవం. ఆమె పాఠాలతో పాటు.. విద్యార్థులకు జీవిత పాఠాలను బోధిస్తుంటారు. ఈ క్రమంలో తమ ప్రియమైన టీచర్ ఒక రోజు ఆకస్మికంగా వేరే పాఠశాలకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. సాధారణంగా ఉపాధ్యాయులు తరచుగా ఒక పాఠశాల నుంచి మరోక పాఠశాలకు ప్రమోషన్ లేదా బదీలీపై వెళ్తుంటారు.

టీచర్ సంపాకు విద్యార్థుల వీడ్కోలు

అయితే, టీచర్ సంసాపట్ల పాఠశాల విద్యార్థినలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.  ఆమె అంటే విద్యార్థులకు ఎంతో గౌరవం. తమ టీచర్​ ట్రాన్స్​ఫర్​ అయి వెళ్తున్నారని తెలిసి చాలా ఎమోషనల్​ అయ్యారు. ఎలాగైన తమ టీచర్​కు గుర్తుండిపోయేలా వీడ్కొలు పలకాలనుకున్నారు.

దీనికోసం విద్యార్థినులంతా కలిసి ఒక ప్లాన్ వేశారు. వారు సంపా టీచర్​ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత టీచర్​ను.. పాఠశాల గ్రౌండ్​లోకి తీసుకొని వచ్చారు. అప్పుడు విద్యార్థినులు.. ‘రబ్​నే బనాదీ జోడి’ సినిమాలోని ఒక పాటను పాడారు. వారంతా మోకాళ్లపై కూర్చుని.. ‘ నా కుచ్ మాంగ.. నా కుచ్​ ఫూచా.. తూనే దియా జో దియా దిల్సే దియా.. తుజ్​ మే రబ్​ దిఖ్​తా హై.. మేడం హమ్ క్యా కరే’ అంటూ పాటను పాడారు. ఆ తర్వాత.. వారంతా తమ చేతిలో గులాబీ పువ్వుపట్టుకుని టీచర్​ ముందు కూర్చోని ఎమోషనల్​ (Teacher Gets Heart Warming Farewell) అయ్యారు.

టీచర్ కు విద్యార్థుల హృదయపూర్వక వీడ్కోలు

అక్కడి విద్యార్థినులంతా (Students Emotional) కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి ప్రేమను చూసిన సంపా టీచర్ కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యార్థులందరిని ప్రేమతో హత్తుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో ట్రెండ్ (Viral News)​ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘ఇలాంటి టీచర్​ దొరికినందుకు నిజంగా మీరు అదృష్టవంతులు..’, ‘నిజంగా.. మా స్కూల్​ డేస్​ గుర్తుకు వచ్చాయి..’, ‘ ఇంతటి ప్రేమను చూపించే విద్యార్థులు దొరకడం కూడా చాలా అరుదు..’,‘ మా టీచర్లు గుర్తొస్తున్నారు.. వారిని మిస్​ అవుతున్నా..’, ‘ వీడియో చూస్తుంటే కళ్లలో నీళ్లు ఆగడం లేదు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Emotional video, Students, VIRAL NEWS, Viral Videos, West Bengal

ఉత్తమ కథలు