HOME »NEWS »TRENDING »viral video watch rpf constable saves two senior citizens from coming under moving train at kalyan station srd

Viral Video : రియల్ హీరో.. రెప్పపాటు కాలంలో వృద్ధ జంటను కాపాడిన రైల్వే కానిస్టేబుల్

Viral Video : రియల్ హీరో.. రెప్పపాటు కాలంలో  వృద్ధ జంటను కాపాడిన రైల్వే కానిస్టేబుల్
RPF Constable saves two senior citizens (Photo : Twitter)

Viral Video : ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం. క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసేవి.. భూమ్మీద ఇంకా నూకలుండబట్టి ఆ వృద్ధ జంట బతికింది. లేకపోతే రైలు పట్టాల కింద పడి చనిపోయేవారు. కానీ ఆ వృద్ధ జంటను ఓ ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ సాహసోపేతంగా కాపాడాడు.

  • Share this:
    ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం. క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసేవి.. భూమ్మీద ఇంకా నూకలుండబట్టి ఆ వృద్ధ జంట బతికింది. లేకపోతే రైలు పట్టాల కింద పడి చనిపోయేవారు. కానీ ఆ వృద్ధ జంటను ఓ ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ సాహసోపేతంగా కాపాడాడు. అతను సేవ్ చేసే ఘటన సీసీ టీవీలో రికార్డయ్యింది. ఆ కానిస్టేబుల్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వేస్టేషన్ లో జరిగింది. వివరాల్లోకెళితే..మహారాష్ట్రకి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు కళ్యాణ్ రైల్వే స్టేషన్ లోని నాలుగో నెంబర్ ప్లాట్ ఫామ్ మీద కి వచ్చిన గోదాన్ స్పెషల్ కోవిడ్ ఎక్స్ ప్రెస్ ఎక్కడానికి హాడావుడిగా పరిగెత్తారు. వేగంగా కదులుతున్న ట్రైన్ బామ్మ ఎక్కపోతుండగా ఆమె కిందకు పడబోయింది. ఇంతలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. మెరుపు వేగంతో స్పందించి ఆమె S-12 కోచ్ లోకి ఎక్కించాడు. కానీ, అంతలో ఆమె భర్తను కూడా అక్కడే ఉన్న ప్రయాణికులు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఇలాగే కాపాడారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.


    వృద్ధ జంట ప్రాణాలు కాపాడినందుకు ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ను అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కానిస్టేబుల్ పేరు శేష్ రావ్ పటేల్. ఆ ప్రయాణికుడ్ని అస్ఫక్ మహమ్మద్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. తండ్రి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కి ధన్యావాదాలు తెలిపాడు అస్ఫక్ మహమ్మద్ ఖాన్ కుమారుడు అబ్తాబ్ ఖాన్.
    Published by:Sridhar Reddy
    First published:January 08, 2021, 15:04 IST