• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO VERY HUGE 11 FEET CROCODILE TRYING TO ATTACK A FISHERMAN IN FLORIDA WATCH VIDEO HERE NK

Viral video: వలలో చేప చిక్కింది అనుకున్నాడు.. తీరా చూస్తే మొసలి... ఆ తర్వాత...

Viral video: వలలో చేప చిక్కింది అనుకున్నాడు.. తీరా చూస్తే మొసలి... ఆ తర్వాత...

వలలో చేప చిక్కింది అనుకున్నాడు.. తీరా చూస్తే మొసలి (image credigt - youtube)

Viral video: అసలు చేప బదులు మొసలి ఎందుకు వచ్చింది. ఆ మొసలి ఏం చేసింది... అనేది వీడియో చూసి అంతా థ్రిల్ అవుతున్నారు. ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం.

  • Share this:
    Viral video: వైరల్ వీడియోల్లో యానిమల్ వీడియోలు ఇచ్చేంత థ్రిల్ మరేవీ ఇవ్వవు. ముఖ్యంగా వన్యప్రాణులైతే... ప్రాణాలు డేంజర్‌లో పడేసి... వైరల్ అవుతాయి. అలాంటి ఓ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు దాన్ని జాగ్రత్తగా అందరికీ షేర్ చేస్తూ... అందరూ చూసేలా చేస్తున్నారు. అందువల్ల అది ఏకంగా 8 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. ఇంకా తెచ్చుకుంటూ ఉంది. ఇందులో ఓ మొసలి... సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వీడియో చూస్తూ నెటిజన్లు ఆ మొసలిని చూసి... "వామ్మో అది చూడు ఎలా చూస్తోందో కోపంగా" అంటున్నారు. మరి ఆ మొసలి మొహం అలాగే ఉంది. అది నిల్చున్న స్టైల్ కూడా అలాగే ఉంది.

    అసలేమైందంటే... అమెరికా రాష్ట్రం ఫ్లోరిడాలో... ఎవెర్‌గ్లాండ్స్ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఓ పెద్ద సరస్సు ఉంది. అందులో చేపలు పడదామని ఓ వ్యక్తి వల వేశాడు. కాసేపటికి వలకు ఏదో తగిలింది అనుకున్నాు. ఐతే... అక్కడికి వెళ్లే ముందే ఎవరో అతనికి చెప్పారు. ఆ సరస్సులో మొసళ్లు ఉంటాయి జాగ్రత్త అని. అతను సరే అంటూ జాగ్రత్తగా ఉన్నాడు. వలను వెనక్కి లాగుదామా అని చూస్తుంటే... అటుగా ఓ మొసలి నీటి లోంచీ నెమ్మదిగా దగ్గరకు వస్తున్నట్లు కనిపంచింది. దాని తల కొద్దిగా నీటిపైకి కనిపిస్తోంది. అది చూసిన కుర్రాడు... వామ్మో మొసలి... దేవుడా... ఇటే వస్తోంది... అనుకుంటూ సరస్సు నుంచి కాస్త దూరంగా వెనక్కి వెళ్లాడు. అప్పటికే ఆ మొసలి అతని వెంట పడింది. కొంత దూరం ఛేజ్ చేసింది. ఓ చోట ఆగి... అతన్ని కొరికి తినేసేలా చూసింది. దాన్ని చూడగానే అతనికి టెన్షన్ వచ్చేసింది. వామ్మో అనుకుంటూ... అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నాడు.

    Viral video, viral videos today, viral video india, viral video clips, viral videos today youtube, viral videos of 2021, viral videos today india, viral videos this week, viral videos today facebook, వైరల్ వీడియో, ట్రెండింగ్ వీడియో,
    వలలో చేప చిక్కింది అనుకున్నాడు.. తీరా చూస్తే మొసలి (image credigt - youtube)


    అయితే... మొసళ్లు నేలపై అంత యాక్టివ్‌గా ఉండవు కదా... అని డౌట్ వచ్చి... కొన్ని క్షణాల తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి చూశాడు. అప్పుడే ఆ మొసలి... తిరిగి నీటిలోకి వెళ్లిపోతూ కనిపించింది. హమ్మయ్య అనుకున్నాడు. ఇదంతా వీడియో తీశాడు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. చేపల సంగతేమో గానీ... ఈ వీడియో వైరల్ అవ్వడం ద్వారా ఇప్పటికే అతను రూ.32 వేల దాకా సంపాదించాడు అనుకోవచ్చు. ఆ వీడియో మీరూ చూడండి.

    ఇందులో అతను గోప్రో (gopro) కెమెరా వాడాడు. దాన్ని బాడీకి ఎటాచ్ చేసుకున్నాడు. అందువల్ల అంతా రికార్డ్ అయ్యింది. ఇంతకీ అతని పేరు టమ్మీ లీ. మే 8న ఈ ఘటన జరిగింది. ఆ మొసలి 11 అడుగుల దాకా ఉందని తెలిపాడు. ఓ మొసలి మన వెంట పడితే మనకు ఎంత టెన్షన్ ఉంటుందో... టమ్మీకీ అంతే టెన్షన్ వచ్చింది.

    ఇది కూడా చదవండి: మీ గోర్లపై అర్థ చంద్రాకారం ఉందా... అయితే మీరే అదృష్టవంతులు... ఎందుకో తెలుసుకోండి

    మన తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ్లు కూడా ఇలాగే చేపలు పట్టేందుకు నదుల దగ్గరకు వెళ్తుంటారు. ఇలాంటివి జరుగుతుంటాయి. జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మన సంగారెడ్డిలోని మంజీర నదిలో వందల కొద్దీ మొసళ్లు ఉంటాయి. వాటితో జాగ్రత్త పడాలి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు