హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో.. ఆవుపైన అత్యంత క్రూరంగా దాడిచేసిన పిట్ బుల్ శునకం.. వీడియో వైరల్..

వామ్మో.. ఆవుపైన అత్యంత క్రూరంగా దాడిచేసిన పిట్ బుల్ శునకం.. వీడియో వైరల్..

ఆవుపైన దాడిచేస్తున్న పిట్ బుల్ శునకం

ఆవుపైన దాడిచేస్తున్న పిట్ బుల్ శునకం

Uttar Pradesh: పిట్ బుల్ కుక్క ఆవు దవడలను గట్టిగా పట్టుకుంది. ఆవు బాధతో అరుస్తుండటంతో అక్కడి వారు వెంటనే దాన్ని విడిపించడానికి ప్రయత్నించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

మనం ఇప్పటి వరకు ఉడుము పట్టు అని తరచుగా వింటుంటాం. అంటే ఉడుము తోకను పట్టుకుని ఒకప్పుడు కోట గోడలు కూడా ఎక్కేవారంటా. అంత బలంగా అది గోడను పట్టుకుని ఉంటుంది. అయితే.. ఇక్కడ కూడా ఒక శునకం ఆవు దవడలను గట్టిగా పట్టుకుంది. దాన్ని విడిపించడానికి స్థానికులకు తలప్రాణం కాస్త తోకకు వచ్చింది. ఈ ఘటన వైరల్ గా (Viral video) మారింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh) కాన్పూర్ లో షాకింగ్ ఘటన సంభవించింది. కాన్పూర్ లో ఉన్న నదీ వద్ద కొందరు స్నానం చేయడానికి వచ్చాడు. ఒక వ్యక్తి తన ఆవుతో పాటు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడే మరో వ్యక్తి తన పిట్ బుల్ కుక్కతో వచ్చాడు. దీంతో పిట్ బుల్.. ఆవుపైన దాడిచేసింది. వెంటనే అమాంతం దాని దవడలను గట్టిగా పట్టేసుకుంది. ఆవు బాధతో అరుస్తున్న.. ఉడుము పట్లులాగా గట్టిగా పట్టేసుకుంది. చుట్టుపక్కల వారు ఆవు బాధను చూడలేక , శునకాన్ని విడిపించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. పాపం.. ఆవు బాధతో గట్టిగా అరుస్తు విలవిల్లాడిపోయింది.

కానీ అది కర్రతో కొడుతున్న, ఏంచేసిన ఆవును మాత్రం వదలడం లేదు. చివరకు కుక్కను.. నీటిలోనికి తీసుకెళ్లి ముంచితే అప్పుడు అది ఆవును వదిలింది. దీంతో ఆవు బతికిపోయానని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. పిట్ బుల్ శునకం పెంచుకోడం కోసం లైసెన్స్ కల్గిఉన్నాడా .., టీకాలు ఇప్పించాడా లేదా అని అధికారులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు