హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: మా తల్లే.. సెల్ ఫోన్ మీద తుపుక్.. తుపుక్.. అని ఉమ్మేస్తున్న యువతి.. ఎందుకో తెలుసా..?

OMG: మా తల్లే.. సెల్ ఫోన్ మీద తుపుక్.. తుపుక్.. అని ఉమ్మేస్తున్న యువతి.. ఎందుకో తెలుసా..?

సెల్ ఫోన్ మీద ఉమ్మేస్తున్న యువతి

సెల్ ఫోన్ మీద ఉమ్మేస్తున్న యువతి

Viral Video: ప్రస్తుతం చాలా మంది సెల్ ఫోన్ ను ఆరోప్రాణంలా భావిస్తున్నారు. ఒక నిముషం ఫోన్ కన్పించక పోయిన ప్రపంచం మునిగిపోయిందేమో అన్నంత ఫీలవుతారు. ఇంత ఇంపార్టెంట్ అయిన ఫోన్ మీద ఒక అమ్మాయి పబ్ లో తుపుక్ అంటూ ఉమ్మింది.

ప్రస్తుతం సోషల్ మీడియా (Social media)  ట్రెండ్ నడుస్తోంది. ప్రతి రోజు వేలల్లో వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీ ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలను (viral video) చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరు తమ ఫోన్ ను సీక్రెట్ గా ఉంచుకుంటారు. వారికి సంబంధించిన పర్సనల్ వ్యవహారాలున బయటకు రాకుండా వాటికి లాక్ లు పెడుతుంటారు. కొందరు నంబర్ లాక్ పెడితే, మరికొందరు ప్యాటర్న్ లాక్ పెడతారు. మరికొందరు ఫింగర్ ప్రింట్ ను, ఫేస్ ఇమేజ్ లాక్ ను కూడా పెడుతుంటారు.

అయితే, ప్రతి ఒక్కరు తమకంటూ స్పెషల్ ట్యాలెంట్ (Special talent) ను కల్గిఉంటారు. దీంతో వారు ప్రత్యేకంగా గుర్తించబడతారు. యూఎస్ కు చెందిన యువతికి ప్రత్యేక ట్యాలెంట్ ఉంది. ఆమె తన ఫోన్ లాక్ ను చేతితో కాకుండా ఉమ్మి వేయడంతో కూడా ఫోన్ ను (mobile unlock) అన్ లాక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


పూర్తి వివరాలు.. యూఎస్ కు (United states) చెందిన మిలా మోనెట్ అనే యువతికి స్పెషల్ ట్యాలెంట్ ఉంది. ఆమె తన ఫోన్ లను (Cell phone) చేతివేళ్లతోనే కాకుండా, తన లాలాజలంతో కూడా అన్ లాక్ చేస్తుంది. సాధారణంగా తమ మొబైళ్లను అన్ లాక్ కోసం చేతివేళ్లు, ప్యాటర్న్ , ఇమేజ్ పద్ధతులను ఉపయోగిస్తుంటారు. కానీ మోనెట్ మాత్రం.. తన ఉమ్మితో ఫోన్ ను అన్ లాక్ చేసింది. ఈ మధ్య.. మోనెట్ పబ్ కు వెళ్లినప్పుడు ఆమె స్నేహితులతో కలసి ఉమ్మితో.. ఫోన్ అన్ లాక్ చేస్తానని పందెం కాసింది. ఆ తర్వాత.. ఆమె చెప్పినట్లు ఫోన్ స్క్రీన్ (moble screen) మీద మీద ఉమ్ముతూ ఫోన్ లాక్ చేసింది. అందరు చూస్తుండగానే ఫోన్ పై ఉమ్ముతూ సెల్ ఫోన్ లాక్(Spit To Unlock Phone) తీసింది.  దీంతో అక్కడి వారు షాకింగ్ కు గురయ్యారు. తమ ఫ్రెండ్ స్పెషల్ ట్యాలెంట్ ను  అభినందించారు. దీనిపై సదరు యువతి స్పందిస్తు.. కొన్ని బంధాల కన్నా.. తన లాలాజలం ఎంతో బలమైందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

First published:

Tags: Mobile phones, United states, Unlock, Viral Video

ఉత్తమ కథలు