• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO UNIQUE WAY OF EXPRESS JOY FOR FIRST DAUGHTER BORN IN THE FAMILY FOR OVER 35 YEARS GH SRD

Viral Video : కొన్ని తరాల తరువాత జన్మించిన ఆడపిల్ల.. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారో తెలుసా..

Viral Video : కొన్ని తరాల తరువాత జన్మించిన ఆడపిల్ల.. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారో తెలుసా..

Viral Video : కొన్ని తరాల తరువాత జన్మించిన ఆడపిల్ల.. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారో తెలుసా..

Viral Video : నాగౌర్ జిల్లాలోని నింబ్డి చందవత గ్రామానికి చెందిన హనుమాన్ ప్రజాపతి అనే వ్యక్తి ఒక రైతు. వీరి గ్రామం జైపూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీరి కుటుంబంలో చాలా సంవత్సరాల తరువాత ఆడపిల్ల పుట్టినందుకు సంతోషించారు.

  • Share this:
చాలామంది వ్యక్తులు ఆడపిల్లలు అదృష్టానికి మారుపేరని నమ్ముతారు. కుటుంబంలో ఒక అమ్మాయి తప్పకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ రాజస్థాన్‌కు చెందిన ఒక కుటుంబంలో కొన్ని తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు. ఎట్టకేలకు 35 ఏళ్ల తరువాత వారికి ఆ అదృష్టం దక్కింది. దీంతో ఇన్నేళ్ల తరువాత తమ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తోందని వారు భావించారు. ఇటీవల జన్మించిన ఆ నవజాత శిశువును కుటుంబ సభ్యులు బుధవారం హెలికాప్టర్‌లో సొంత గ్రామానికి తీసుకువచ్చారు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. హెలికాప్టర్ కోసం వారు రూ .4.5 లక్షలు ఖర్చు చేయడం విశేషం. తమ ఆనందాన్ని, సంతోషాన్ని ఈ రూపంలో వ్యక్తం చేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నాగౌర్ జిల్లాలోని నింబ్డి చందవత గ్రామానికి చెందిన హనుమాన్ ప్రజాపతి అనే వ్యక్తి ఒక రైతు. వీరి గ్రామం జైపూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీరి కుటుంబంలో చాలా సంవత్సరాల తరువాత ఆడపిల్ల పుట్టినందుకు సంతోషించారు. తమ బిడ్డను మొదటిసారి సొంత ఊరికి తీసుకెళ్లడాన్ని ఒక ఉత్సవంగా చేయాలనుకున్నారు. ఏకంగా హెలికాప్టర్‌లో బాలికను ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు హనుమాన్ జైపూర్‌లోని ఒక ప్రైవేట్ సంస్థను సంప్రదించాడు. రూ.4.5 లక్షల వ్యయంతో ఒక హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఛాపర్ కోసం తన సొంత పొలంలో ఒక హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేశాడు. అతడి భార్య హర్సోలావ్ గ్రామంలో ఫిబ్రవరి 2న కూతురికి జన్మనిచ్చింది. ఈ ఊరు హనుమాన్ అత్తగారి గ్రామం. ఇది నింబ్ది నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

తన కుమార్తెను ఇంటికి తీసుకురావడానికి హనుమాన్ బంధువులతో కలిసి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి హర్సోలావ్ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ పూజలు చేసిన తరువాత భార్య చుకా దేవి, నవజాత శిశువుతో కలిసి మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో సొంత ఊరికి బయలుదేరారు. వీరు మధ్యాహ్నం 2.15 గంటలకు నింబ్డి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ హెలిప్యాడ్ నుంచి వారు ఇంటికి వెళ్లే మార్గం మొత్తం పూలతో నిండిపోయింది. ఊరి ప్రజలతో ఆ ప్రాంగణం సందడిగా మారింది. హనుమాన్ కూతురికి స్వాగతం పలికేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో పాపను ఇంటికి తీసుకెళ్లారు. ఈ వేడుకకు హనుమాన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా హాజరయ్యారు.

తన మనవరాలు తొలిసారి సొంత గ్రామంలోకి అడుగు పెట్టడంపై ఆమె తాత మదన్ లాల్ ప్రజాపతి హర్షం వ్యక్తం చేశారు. వీరి కుటుంబంలో చాలా ఏళ్లుగా ఆడపిల్లలు పుట్టలేదు. దీంతో తన కుమారుడికి అమ్మాయి పుడితే.. ఆమెను హెలికాప్టర్‌లో సొంత ఊరికి తీసుకెళ్లాలనుకున్నట్టు మదన్ లాల్ తెలిపారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆడపిల్లలను తక్కువ చేసి చూస్తున్నారు. కొంతమంది కనీసం అమ్మాయిల పుట్టినరోజు వేడుకలను కూడా నిర్వహించట్లేదు. తాము చేసిన ఏర్పాట్లు చూసిన తరువాత అయినా ఇలాంటి వారు మారాలని ఆయన ఆకాంక్షించారు.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు