వైరల్ వీడియో.... సూపర్ మార్కెట్‌లో చోరీ చేసిన తాబేలు... కుక్కల ఆహారం లాగిస్తూ...

Viral Video : మనకైతే రూల్సూ, రెగ్యులేషన్లూ ఉంటాయి. అదే జంతువులకు అవేవీ తెలియవు కదా. ఆ తాబేలుకి ఆకలేసిందేమో... సూపర్ మార్కెట్‌లో డాగ్ ఫూడ్ కోసం ఆరాటపడింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 9, 2019, 9:41 AM IST
వైరల్ వీడియో.... సూపర్ మార్కెట్‌లో చోరీ చేసిన తాబేలు... కుక్కల ఆహారం లాగిస్తూ...
కుక్కల ఆహారం తింటున్న తాబేలు (Image : Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: May 9, 2019, 9:41 AM IST
సూపర్ మార్కెట్‌లో కస్టమర్లు ఉండటం కామన్. అలాంటిది... ఆ సూపర్ మార్కెట్‌లో ఓ కస్టమర్‌కి సడెన్‌గా తాబేలు ఆకారం కనిపించింది. ఇదేంటి తాబేలులా ఉంది అనుకుంటూ దగ్గరకు వెళ్లి చూశాడు. అది నిజం తాబేలే. ఎటు నుంచీ వచ్చిందో గానీ... బాగా ఆకలేసిందేమో... కుక్కలకు వేసే ఆహారపు సంచికి కన్నం పెట్టి... డాగ్ ఫూడ్‌ని లాగించేసింది. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆ కస్టమర్ ఓ చిన్న వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అంతే... ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది. మే 5న పోస్ట్ చేసిన ఆ వీడియోని ఇప్పటివరకూ 1.88 లక్షల మంది లైక్ చెయ్యగా... 48 వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి. ఇక 12వేలకు పైగా కామెంట్లతో షేరవుతోంది ఆ వీడియో.

ఆ టార్టాయిస్‌కి కావాల్సిన సామాన్ల కోసం వచ్చి ఉంటుందని కొందరంటుంటే... అది ఇంకా షాపు లోంచీ బయటకు వెళ్లలేదు కాబట్టి... అది చోరీ చేసినట్లు కాదనీ, తిన్న వాటికి మనీ పే చేస్తుందని కొందరు సరదా కామెంట్లు పెడుతున్నారు. 

ఇవి కూడా చదవండి :

రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలు అంటే ఏంటి..? అక్కడ నోటాకు వెయ్యడమే బెటరా..?

ఈసారి ఏపీ ఫలితాలు గందరగోళమేనా... వీవీప్యాట్లు వైసీపీ, టీడీపీ, జనసేన కొంప ముంచబోతున్నాయా...

దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?

చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?
First published: May 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...