Video : బట్టలు ఉతికిన కోతి... అలా ఉతకడం మన వల్ల కాదు...

Viral Video : ఇటీవల ఓ కోతి... కుళాయి నీళ్లు తాగి... ఆ తర్వాత వాటర్ వేస్ట్ అవ్వనివ్వకుండా... ఆ కుళాయిని కట్టేసింది. ఆ వీడియో వైరల్ అయ్యింది. అలాంటిదే మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 11:28 AM IST
Video : బట్టలు ఉతికిన కోతి... అలా ఉతకడం మన వల్ల కాదు...
వాటే మంకీ (Image : Twitter - Susanta Nanda IFS)
Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 11:28 AM IST
వాషింగ్ మిషన్ కాకుండా... మనం బట్టలు బండపై బట్టలు ఎలా ఉతుకుతామో... అచ్చం అలాగే ఉతికింది ఆ కోతి. ఆ తర్వాత ఆ బట్టలను నీటిలో జాడించింది కూడా. ఆ 36 సెకండ్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనమైతే బట్టలను సుతారంగా ఉతుకుతాం. ఎందుకంటే... గట్టిగా ఉతికితే అవి చిరిగిపోతాయి కాబట్టి. మరి ఆ మంకీకి ఆ విషయం తెలియదు కదా... అది దూకుడుగా బట్టలు ఉతికేస్తుంటే... ఆ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ వీడియోను వేల మంది చూశారు. ఎంతో మంది కామెడీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అచ్చం మనుషుల్లా ఎలా ఉతుకుతోందన్న విషయంపై చాలా మంది తమదైన శైలిలో రకరకాల కారణాలు చెప్పారు. అన్నీ ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి.




కోతులను మనుషుల్ని కాపీ కొట్టడం అలవాటే. మనం ఏం చేస్తున్నామో చూసి... అవి కూడా అలా చేస్తుంటాయి. ఇటీవల ఓ కోతి... ట్యాప్ వాటర్ తాగింది. ఆ తర్వాత వాటర్ వేస్ట్ అవ్వకుండా వెంటనే ట్యాప్ కట్టేసింది.



ఈ వీడియోని చూసిన ఎంతో మంది... ఆ కోతికి ఉన్న జ్ఞానం మనకు కూడా లేకుండా పోతోందే అని ఫీలయ్యారు.
First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...