Home /News /trending /

VIRAL VIDEO THIEF TRIES TO STEAL BIKE AFTER MAN ACCIDENT GETS INSTANT KARMA PVN

Viral Video : ఇన్ స్టంట్ ఖర్మ అంటే ఇదేనేమో..యాక్సిడెంట్ అయిన బైక్ ను దొంగలించబోయి యాక్సిడెంట్ కి గురయ్యాడు

యాక్సిడెంట్ అయిన బైక్ దొంగలిద్దామని యాక్సిడెంట్ కి గురయ్యాడు

యాక్సిడెంట్ అయిన బైక్ దొంగలిద్దామని యాక్సిడెంట్ కి గురయ్యాడు

Thief Gets Instant Karma : మనం కొన్నిసార్లు అలా అనుకోకపోయినా దేవుడు మన చర్యలను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడని పెద్దలు అంటున్నారు. చెడు ఉద్దేశాలు ఉన్నవారికి తక్షణ శిక్షను అమలు చేస్తాడని అంటుంటారు.

Thief Gets Instant Karma : మనం కొన్నిసార్లు అలా అనుకోకపోయినా దేవుడు మన చర్యలను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడని పెద్దలు అంటున్నారు. చెడు ఉద్దేశాలు ఉన్నవారికి తక్షణ శిక్షను అమలు చేస్తాడని అంటుంటారు. చాలా సందర్భాల్లో మనం దీనిని గమనించి ఉంటాం. అయితే ప్రమాదానికి గురైన వ్యక్తి బైక్‌ను దొంగిలించడానికి ప్రయత్నించిన దొంగకు వెంటనే యాక్సిడెంట్ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఇన్ స్టంట్ కర్మ అంటే ఇదేనేమో అంటూ నవ్వుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 'గిడ్డే' హ్యాండిల్ ద్వారా అప్‌లోడ్ చేయబడిన ఓ వీడియోలో....ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకుని స్కూటీ నడుపుతూ రోడ్డుపై వెళ్తున్నాడు. ఏదో ముఖ్యమైన పనిమీద వెళ్తున్నట్లు ఉంది..కాస్త వేగంగా వెళ్తున్నాడు. అయితే అది చిన్న రోడ్డు. మధ్యలో ఓ కారు అతనికి అడ్డుగా వచ్చింది. సడెన్‌గా ఆ కారు రావడంతో బ్రేక్ వేశాడు. కానీ బండి జారింది. దీంతో కాస్త ముందుకెళ్లి బండితో సహా పడిపోయాడు. లక్కీగా అతనికి గాయాలేవీ కాలేదు. ఇంతలో ఐదుగురు స్థానికులు అక్కడికి వచ్చారు. అరే బండి పడిపోయిందే అంటూ బండిని పైకి తీశారు. అయితే ఆ బైకర్
కారు నడిపే వ్యక్తితో వాదనకు దిగాడు. నీ వల్లే ఇలా అయ్యింది.. చూసుకోవద్దా.. రోడ్డుపై ఎలా బడితే అలా నడిపేస్తారా అని గొడవకు దిగాడు. ఇంతలో సాయం చేయడానికి వచ్చిన వారిలో ఒకరు అతనికి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ అతని బైక్‌ను దొంగిలించే ఉద్దేశ్యంతో ఉన్నాడు.

ALSO READ  Shocking : పాపం..నోటితో బాటిల్ మూత ఓపెన్..బాలుడు మృతి

కారు డ్రైవర్‌తో బైక్ ఓనర్ ప్రమాదం గురించి చర్చిస్తున్నప్పుడు..దొంగ బైక్‌తో పారిపోవడానికి ప్రయత్నించాడు. కారు డ్రైవర్‌తో బైకర్ వాదిస్తూ ఉండగా ఈ ఐదుగురు వ్యక్తుల్లో ఒకతను బండిని స్టార్ట్ చేశాడు. అయితే బండి స్టార్ట్ అయ్యి వెళ్లిపోసాగింది. బైక్ ను కంట్రోల్ చేయలేక బండి హ్యాండిల్ పట్టుకొని వెంట పరుగెత్తాడు. కానీ క్రమంగా అది వేగం పుంజుకోవడంతో కొన్ని సెకన్ల తర్వాత బైక్ తో పాటు కింద బోర్లా పడ్డాడు.


దీంతో అతడిని పైకి లేపేందుకు అక్కడున్నవారందరూ వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఇన్ స్టంట్ కర్మ అంటే ఇదేనేమో అంటూ నవ్వుకుంటున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు