హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video: పెళ్లిలో దెయ్యంలా కనిపించిన వధువు... పారిపోయిన వరుడు

Video: పెళ్లిలో దెయ్యంలా కనిపించిన వధువు... పారిపోయిన వరుడు

Video: పెళ్లిలో పారిపోయిన వరుడు (image credit - instagram)

Video: పెళ్లిలో పారిపోయిన వరుడు (image credit - instagram)

Viral Video: అప్పటివరకూ ఆ పెళ్లి ధూమ్ ధామ్‌గా జరుగుతోంది. వచ్చిన వాళ్లంతా... పెళ్లి గ్రాండ్‌గా జరుగుతోంది అనుకున్నారు. అంతలోనే షాకింగ్ ఘటనతో అంతా బిత్తరపోయారు.

Viral Video: జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పెళ్లి. అది కాస్తా కామెడీ అయిపోతోంది కొన్నిసార్లు. ఆ పెళ్లికి... రెండువైపులా బంధువులు తరలివచ్చారు. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్‌గా జరిగాయి. అత్యంత సంప్రదాయబద్ధంగా వివాహం జరుగుతుంటే... వచ్చిన బంధువులు... ఇలాంటి పెళ్లి చూసి చాలా కాలం అయ్యింది అనుకున్నారు. కానీ అంతలోనే వారి ఆనందం ఆవిరైంది. ఆనందం ప్లేస్‌లో ఆశ్చర్యం, షాక్, బాధ, నవ్వు వచ్చాయి. నవ్వాలో బాధపడాలో కూడా అర్థం కాని అయోమయం ఏర్పడింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో... వరుడు... వధువుకి బొట్టు పెట్టాల్సి ఉంటుంది. కూర్చొని ఉన్న వధువుకి... తోడుగా ఇద్దరు మహిళలు ఉన్నారు. బొట్టు పెట్టమని ప్లేటును వరుడికి ఇవ్వగా.. అతను బొట్టు తీసుకొని... పెళ్లికూతురి నుదుటిపై పెట్టబోయాడు. అంతలోనే ఆమె ఢమాల్ మని పక్కకు పడిపోయింది. అది చూసిన వరుడు షాకింగ్ ఫేస్ పెట్టాడు. వెంటనే అతనికి చిరాకొచ్చేసింది. తలపాగా తీసేశాడు. మెడలో దండ తీసి నేలపైకి విసిరికొట్టాడు. భుజంపై కండువా కూడా తీసేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే... పక్కనున్న మహిళ అతని చెయ్యి పట్టుకొని వెళ్లొద్దని బతిమలాడింది. కానీ వరుడు... భయపడిపోతూ... టెన్షన్ పడిపోతూ... వెళ్లిపోయాడు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి.


ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుతున్నారు. అదే సమయంలో ఆశ్చర్యపోతున్నారు. అందరికీ ఒకటే ప్రశ్న... అతను ఎందుకు వెళ్లిపోయాడు అని... కొందరు అతనికి వధువు దెయ్యంలా కనిపించిందనీ... అందుకే పారిపోతున్నాడని అన్నారు. మరికొందరు... అసలీ పెళ్లి వధువుకు ఇష్టం లేదనీ... బొట్టు పెట్టే ముందు కూడా తప్పించుకునేందుకు ఏ మార్గం ఉందా అని ఆలోచిస్తూ... అప్పటికప్పుడు చనిపోయిన దానిలా నటించిందని అంటున్నారు. అందుకే... వరుడు... తనతో పెళ్లి ఇష్టం లేని అమ్మాయిని తానూ చేసుకోవడం ఇష్టం లేకే వెళ్లిపోయాడని అంటున్నారు. కొంత మంది ఏం జరిగిందో అర్థం కావట్లేదు... ఎవరైనా చెప్పండి ప్లీజ్ అని కామెంట్స్ రాస్తున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: డాన్స్ స్టెప్స్... 814 మంది దగ్గర నేర్చుకున్నాడు... ఆ తర్వాత వీడియో చేశాడు

అసలు కారణం ఏంటన్నది మాత్రం తెలియలేదు. మొత్తానికి ఈ వీడియో నవ్వులు, ఆశ్చర్యాలు కలిగిస్తోంది.

First published:

Tags: Viral, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు