హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడింది... వీడియో చూసి మెచ్చుకుంటున్న నెటిజన్లు

Viral Video: ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడింది... వీడియో చూసి మెచ్చుకుంటున్న నెటిజన్లు

Viral Video: గడ్డ కట్టిన స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకి కుక్కకోసం ప్రాణాలకు తెగించడం నెటిజన్లను కదిలిస్తోంది. ఆమెను హీరో అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి.

Viral Video: గడ్డ కట్టిన స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకి కుక్కకోసం ప్రాణాలకు తెగించడం నెటిజన్లను కదిలిస్తోంది. ఆమెను హీరో అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి.

Viral Video: గడ్డ కట్టిన స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకి కుక్కకోసం ప్రాణాలకు తెగించడం నెటిజన్లను కదిలిస్తోంది. ఆమెను హీరో అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి.

  చూట్టూ మైనస్ డిగ్రీల వాతావరణం. ఇంట్లోంచీ బయటకు రావడమే కాదు... ఇంట్లో ఉన్నా వెన్నులో వణుకు తప్పదు. అక్కడ ఇళ్లు, చెట్లు, వాహనాలు, రోడ్లు, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ గడ్డకట్టేశాయి. ఆ పరిస్థితుల్లో ఓ ఇంట్లో రెండు కుక్కలు ఆడుకుంటుండగా... ఓ కుక్క గడ్డకట్టిన స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయింది. వెంటనే మరో కుక్క గట్టిగా అరుస్తుంటే... దాని యజమాయి ఇంట్లోంచీ బయటకు వచ్చింది. పూల్‌లో కుక్క పడిపోయిందని గుర్తించి... దాని కోసం పూల్‌లోకి దూకేసింది. ఐతే... కుక్క పడిపోయిన చోట కనిపించలేదు. దాని కోసం కొంత సేపు వెతకాల్సి వచ్చింది. అంత చలిలో అలా వెతకడం ఎంతో కష్టం. క్షణాల్లో బాడీలో నరాలన్నీ గడ్డకట్టి చిట్లి పోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఆమె ప్రాణాలకు తెగించింది. కొన్ని క్షణాల తర్వాత కుక్క కనిపించింది. దాన్ని కాపాణి... ప్రాణం పోయింది.

  అమెరికా... టెన్నెస్సీలో ఈ ఘటన జరిగింది. "ఆ కాసేపూ నాకు టెన్షన్‌తో ఊపిరి ఆడలేదు. అసలు అది పూల్‌లో పడిపోయిందని నాకు వెట్ చెప్పడం అద్భుతం" అని కుక్క ఓనర్ జెన్నీ టాటమ్ తెలిపింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

  ముర్ఫ్రీస్‌బోరో లోని ఇంట్లో గత వారం ఈ ఘటన జరిగిందని తెలిసింది. ఆ సమయంలో కుక్కలు పరిగెడుతుంటే... వాటిని జెన్నీ వీడియో తీయసాగింది. అంతలోనే అలా జరిగింది. కుక్క కోసం వెతుకుతూ ఆ కంగారులో తాను ఐస్‌ని చేతులతో కట్ చేశాననీ... అందువల్ల తన చేతులు కట్ అయ్యాయని జెన్నీ తెలిపింది. ఆ సమయంలో తనకు కుక్కను కాపాడాలనే ఉద్దేశం తప్ప మరేదీ అనిపించలేదని ఆమె వివరించింది.

  అమెరికాలో ప్రస్తుతం వాతావరణం చాలా చల్లగా ఉంది. అన్నీ గడ్డకట్టేస్తున్నాయి. ఈ ఘటనలో స్విమ్మింగ్ పూల్‌లో 4 అడుగుల వరకూ నీరు ఉంది. అందులో పై అడుగు మొత్తం గడ్డ కట్టేసింది. అందువల్ల కుక్క ఆ పై ముక్కపై పడి... అది విరగడంతో... నీటిలో పడింది. చెన్నీ, ఆమె భర్త కలిసి... కుక్కను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ పిట్ బుల్ డాగ్ ఆరోగ్యంగా ఉంది.

  ఇది కూడా చదవండి: Horoscope Today: ఫిబ్రవరి 27 రాశి ఫలాలు... మరో ఆదాయ మార్గం కోసం అన్వేషణ

  యజమానుల కోసం కుక్కలు ప్రాణాలర్పించే ఘటనలు చూస్తూ ఉంటాం. ఇక్కడ కుక్క కోసం యజమాని ప్రాణాలకు తెగించడంతో నెటిజన్లు ఈ వీడియో చూసి ఆమెను మెచ్చుకుంటున్నారు.

  First published:

  Tags: Dog, Viral Videos

  ఉత్తమ కథలు