OMG: నిజంగానే నువ్వు దేవుడయ్యా బౌలరూ

క్రికెట్‌లో అసలుసిసలైన మజాను చాటుతోందీ ఇన్ని నిడివిగల వీడియో. చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సి ఉండగా...మరో బంతి మిగిలి ఉండగానే బ్యాటింగ్ జట్టు గెలిచింది.

news18-telugu
Updated: January 9, 2019, 10:46 PM IST
OMG: నిజంగానే నువ్వు దేవుడయ్యా బౌలరూ
ఫన్నీ క్రికెట్
news18-telugu
Updated: January 9, 2019, 10:46 PM IST
చివరి బంతికి 6 పరుగులు కావాలి...ఒక్క బంతి మిగిలి ఉండగానే బ్యాటింగ్ జట్టు గెలిచింది. ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన ఎవరైనా ఎదుటి జట్టును ఇలా గెలిపించిన నువ్వు దేవుడయ్యా బౌలరూ అనకుండా ఉండలేరు.

చివరి బంతికి ఆరు పరుగులు సాధించాల్సి ఉండగా...బౌలరు వరుసగా ఆరు బంతులను వైడ్ వేశాడు. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే ఆ జట్టు గెలిచిపోయింది. విజయంపై ఆశలు వదిలేసుకున్న బ్యాటింగ్ జట్టు ఆటగాళ్లు...ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు. మహారాష్ట్రలో రెండు గల్లీ జట్ల మధ్య మ్యాచ్‌లో ఈ అసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.





క్రికెట్‌లో అసలుసిసలైన మజాను చాటిచెప్పే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...